దేశమంతా కరోనా కారణంగా లాక్ డౌన్ అమలవుతోంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో కలసి సాగుతున్నాయి. ఒక్కో రాష్ట్రం ఒక్కో తరహాలో కరోనాపై పోరాడుతున్నాయి. అయితే ఈ విషయంలో దేశవ్యాప్తంగా క్రెడిట్ కొట్టేశారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్.. కరోనా వైరస్ ను నిరోధించడం కోసం లాక్ డౌన్ ను అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ ఒన్ స్థానంలో నిలిచింది.

 

 

జాతీయ న్యూస్ ఛానల్ ఎన్.డి.టి.వి. నిర్వహించిన ఒక అధ్యయనంలో ఏపీ నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది. టీవీ వారు ఏపీలో కేసులు పెరిగి ఆ తర్వాత తగ్గుతున్న తీరుపై గ్రాఫ్ చూపుతూ ఓ స్టోరీ ప్రజెంట్ చేశారు. ఏపీలో లాక్ డౌన్ విజయవంతంగా ఉందని సదరు ఛానల్ ఏపీ సర్కారును మెచ్చుకుంది.

 

 

కరోనా వైరస్‌ కట్టడికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుందని, అందుకే ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎక్కువగా పెరగలేదని ఎన్డీటీవి తెలిపింది. లాక్‌డౌన్‌ను పగడ్భందీగా అమలు చేసి కరోనా వైరస్ చైన్‌ను తెగగొట్టడంలో ఏపీ పెద్ద విజయం సాధించిందని ప్రశంసింది.

 

 

ఆంధ్రప్రదేశ్ తర్వాత ఆ ఛానల్ కేరళకు రెండో స్థానం ఇచ్చింది. ఇప్పుడు ఈ ఎన్డీటీవీ సర్వే విషయాన్ని వైసీపీ తన విజయంగా చెప్పుకుంటోంది. మంత్రి పేర్ని నాని కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారారు. ప్రజలను భయపడాల్సిన పని లేదని, కొద్ది రోజులు ఇంట్లోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఏదేమైనా ఓ జాతీయ ఛానల్ మెచ్చుకోవడం అంటే సాధారణ విషయం కాదు కదా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: