తెలుగు దేశం పార్టీలో కాస్త బుర్ర ఉన్న నాయకుడిగా.. సీనియర్ నాయకుడిగా యనమల రామకృష్ణుడుకు పేరుంది. ఆయన్ను పార్టీలో అంతా మేధావి అంటుంటారు. అయితే ఇటీవల ఆ మేధావి బుర్ర మరీ విచిత్రంగా పని చేస్తోందని చెప్పాలి. అందుకు తాజాగా ఆయన చేసిన డిమాండ్ వింటే అర్థమవుతోంది.

 

 

ఇంతకీ ఆయన డిమాండ్ ఏంటంటే.. గ్రామ, వార్డు వలంటీర్లకు, గ్రామ, వార్డు సచివాలయాలలో పనిచేసేవారికి జీతాలు ఇవ్వకూడదట. ఎందుకంటే.. వారంతా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలేనట. శాసనమండలిలో ప్రతిపక్షనేత, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఈ ఆరోపణలు చేశారు. నాలుగు లక్షల గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి జీతాల పేరుతో వైఎస్ ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఏడాదికి రూ.4వేల కోట్లు దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.

 

 

అంతే కాదు.. కరోనా కోసం కేంద్రం అదనపు నిధులు ఇచ్చిందని, ఆ నిధులన్నీ జగన్ సర్కారు ఇలా విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తోందని యనమల ఆరోపిస్తున్నారు. అయితే ఈ యనమల ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. వాలంటీర్ వ్యవస్థను సీఎం జగన్ అయ్యాక యుద్ధ ప్రాతిపదికన తీసుకొచ్చారు. ఇప్పుడు ఏపీలో ప్రతి 50 ఇళ్లకూ ఓ వాలంటీర్ ఉన్నాడు.

 

 

ఆ వాలంటీర్‌కు ఆ 50 ఇళ్లకు సంబంధించిన ఏ విషయమైనా పక్కాగా తెలిసిపోతుంది. మొన్న కరోనా రోగులను, వారు ఎవరెవరిని కలిశారన్న విషయాలనూ.. విదేశాల నుంచి ఎవరు వచ్చారన్న విషయాలనూ ఈ వాలంటీర్ వ్యవస్తే పక్కాగా గుర్తించిందని ప్రశంసలు వచ్చాయి. అందులోనూ ఈ వాలంటీర్లకు ఇచ్చే జీతం చాలా తక్కువ. మరి ఇప్పుడు ఈ టీడీపీ మేధావి అవి కూడా ఇవ్వొద్దంటున్నారు. ఇంకో విషయం.. వారంతా వైసీపీ కార్యకర్తలని అంటున్నారు. అలాంటప్పుడు వారి నియామకాలపై కోర్టుల్లో ఎందుకు పోరాడలేదో టీడీపీ మేధావులే చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: