కళ్లకు కనిపించకుండా దాడి చేసి కాటికి పంపిస్తూ ప్రపంచాన్ని ప్రాణభయంతో వణికిస్తున్న మహమ్మారి వైరస్ కరోనా . వైరస్ బారినపడి ఎంతోమంది ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఎంతోమంది మృత్యువుతో పోరాడుతున్నారు. ఇక భారత దేశంలో కూడా కరోనా  విజృంభన మరింత భయాందోళనకు గురిచేస్తుంది అన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వైరస్ విజృంభణ  మాత్రం ఎక్కడా ఆగడం లేదు. ఈ మహమ్మారి అందరిని బెంబేలెత్తిస్తూ  చిగురుటాకులా వణికిస్తోంది . 

 

 

 అయితే కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో డాక్టర్లు ప్రాణాలకు తెగించి మరీ కరోనా  వైరస్ పై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఓవైపు డాక్టర్లు కరోనా  సోకిన వారికి చికిత్స అందిస్తూ వారికి పునర్జన్మనిస్తూ తమ ప్రాణాలను పణంగా పెట్టి మరి పోరాడుతుంటే మరోవైపు పోలీసులు... కరోనా ప్రజల చెంతకు చేరకుండా సామాజిక దూరం పాటించేలా పోరాటం చేస్తున్నారు. అయితే కరోనా  వైరస్ సోకిన పేషెంట్లకు చికిత్స అందిస్తున్న వైద్యులు కొంచెం అజాగ్రత్తగా ఉన్నా వారి ప్రాణాలకు ముప్పు వస్తుందన్న  ఆ విషయం తెలిసిందే. అలా  ఇప్పటికే చాలా మంది వైద్యులు కూడా కరోనా  వైరస్ పేషెంట్లకు చికిత్స చేస్తూన్న  వారికి కూడా కూడా  వైరస్ సోకి మరణించిన వారు ఉన్నారు. 

 

 

 అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఆదివారం ఒక్కరోజే 11 కేసులు నమోదయ్యాయి. వీరిలో 8 మంది ప్రభుత్వ ఉద్యోగులు కావడం మరింతగా కలకలం రేపుతోంది.  ఎనిమిది మందిలో ఒక పోలీసు అధికారీ,  ఇద్దరు సచివాలయ ఉద్యోగులు... ఐదు మంది రెవెన్యూ ఉద్యోగులు ఉండటం గమనార్హం. వీరంతా రెడ్ అలెర్ట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అధికారులు.  వీరికి ముందుగా ఎలాంటి కరోనా  వైరస్ లక్షణాలు లేవు అంటూ తెలిపారు అధికారులు ఇదిలా ఉంటే...అనంతపురం జిల్లాలో కరోనా  వైరస్ సోకి ఏఎస్ఐ మరణించిన విషయం తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: