కరోనా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు నిమిషం నిమిషం ప్రాణాల మీద ఆశలు వదిలేసుకుకున్నారు..అందుకే లాక్ డౌన్ ను కూడా మరింత కట్టుడిడ్డంగా ఏర్పాటు చేశారు.. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ఇదే అదునుగా చూసుకున్న దొంగలు విచ్చల విడిగా సంచరిస్తున్న ప్రజలను భయ బ్రంతులకు గురిచేస్తున్నారు..

 

 

 

 

మరో ముఖ్య విషయమేంటంటే సైబర్ నేరగాళ్లు కూడా అదే అదనుగా భావించిన నేరాలకు పాల్పడుతున్నారు.. పెద్ద పెద్ద వస్తువులను టార్గెట్ చేయడమే కాకుండా హ్యాక్ చేస్తున్నారు.. ముఖ్యమైన సమాచారాన్ని కూడా దొంగలిస్తున్నారు..హ్యాకర్లు కంప్యూటర్లను, స్మార్ట్ ఫోన్లను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు మాల్వేర్లు, స్పైవేర్లు చొప్పిస్తుంటారు. అందుకోసం కొన్ని లింకులను పంపిస్తారు. 

 

 

 

ఆ లింకులను క్లిక్ చేస్తే చాలు, సదరు వైరస్ చొరబడుతుంది. తాజాగా ఆపిల్ సంస్థ ఉత్పత్తులైన ఐఫోన్, ఆపిల్ వాచ్, ఐపాడ్, మాక్ లకు ఓ టెక్ట్స్ మెసేజ్ పెను విఘాతంలా పరిణమించింది.అందుకు సంబంధించిన ఒక సందేశం వస్తే ఆపిల్ ఉత్పత్తులు క్రాష్ అవుతున్నట్టు గుర్తించారు. ఈ మెసేజ్ లో కొన్ని సంజ్ఞలు, ఇటలీ జాతీయ జెండా, సింధీ చిహ్నాలు ఉన్నాయని యూజర్లు చెబుతున్నారు. ఈ సందేశం వస్తే క్రాష్ అవడం గానీ, టచ్ ప్యాడ్ పూర్తిగా మొరాయించడం కానీ జరుగుతోందని పలువురు వెల్లడించారు.

 

 

 

ఈ వ్యవహారాన్ని ముందే పసిగట్టిన ఐ ఫోన్ సంస్థ హ్యాకర్ల ప్రయత్నాన్ని తిప్పి కొట్టడంతో పూర్తిగా లీనమై పోయింది.. దీంతో సెక్యూరిటీ ప్యాచ్ ను రిలీజ్ చేసింది. ఆయా డివైస్ ల్లోని సాఫ్ట్ వేర్ వెర్షన్లను అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. కాగా ఈ రాక్షస సందేశం ట్విట్టర్, ఐమెసేజెస్ ప్లాట్ ఫాంలపై విరివిగా వాడుతారు అని తెలుస్తుంది.. అందుకే  మీతో  ఆ ఫోన్ కనుక  ఉంటే జాగ్రత్త సుమీ... 

మరింత సమాచారం తెలుసుకోండి: