అసలు సిసలైన ఫ్యాక్షనిజం అంటే ఎలా ఉంటుందో చూపిస్తూ... అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను అబ్బుర పరుస్తుంది... పగ ప్రతీకారాలు... ఎత్తులు పై ఎత్తులు అన్నింటినీ ఒకే సినిమాలో చూపించి అద్భుతంగా తెరకెక్కించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు రామ్ గోపాల్ వర్మ. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం రక్త చరిత్ర. ఈ పేరుకు తగ్గట్టుగానే సినిమాలో  మొత్తం రక్తపాతాలే  ఉంటాయి. ఒకరిపై ఒకరు పగలు తీర్చుకోవడం. విద్యార్థులను చంపడానికి స్కెచ్ వేసి మాటువేసి కత్తులతో అతి దారుణంగా నరికి వేయడం... రక్త చరిత్ర సినిమాలో కనిపిస్తూ ఉంటాయి. 

 

 

 రక్త చరిత్ర సినిమా మొదటి పార్ట్ మంచి విజయం సాధించడంతో రక్తచరిత్ర 2 అని రెండవ పార్ట్  కూడా తెరకెక్కించారు రాంగోపాల్ వర్మ. రాంగోపాల్ వర్మ అంటే రియలిస్టిన్  సినిమాలకు పెట్టింది పేరు అనే విషయం తెలిసిందే. రాంగోపాల్ వర్మ సినిమాలో పాత్రలు అన్నీ నిజజీవితంలో జరిగిన పాత్రలే . యదార్థ సంఘటనల ఆధారంగానే రాంగోపాల్ వర్మ సినిమాలు తీస్తూ  ఉంటారు. అలాంటి చిత్రమే రక్త చరిత్ర. రక్త చరిత్ర సినిమాలో అడుగడుగునా యాక్షన్ సన్నివేశాలు కనిపిస్తాయి.  అడుగడుగున రక్త పాతాలు... ప్రతి కారాలు  ఎత్తులు పై ఎత్తులు అన్ని సినిమా చూస్తున్న ప్రేక్షకులను అబ్బుర పరుస్తూనే ఉంటాయి. 

 

 రక్త చరిత్ర సినిమాలో ప్రతి సన్నివేశం యాక్షన్ సన్నివేశం ప్రతి సిన్  ఒకరినొకరు చంపుకోవడం.. ఈ సినిమాలు విలన్లు హీరోలు ఉండరు.. పగలు ప్రతీకారాలు మాత్రమే ఉంటాయి. అందుకే రక్త చరిత్ర సినిమా ఎన్ని సార్లు వచ్చిన ప్రేక్షకులు కళ్ళార్పకుండా చూస్తూ ఉంటారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది అనే చెప్పాలి. యాక్షన్ సినిమా అయినా ఫ్యాక్షన్ సినిమా అయినా దానికి కేరాఫ్ అడ్రస్ రక్త చరిత్ర సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: