ఆంధ్రజ్యోతి పత్రికపై సీఎం కేసీఆర్ చర్య తీసుకోబోతున్నారా.. ఇప్పుడు ఇది మీడియా సర్కిల్లో ఆసక్తి కరమైన చర్చకు దారి తీస్తోంది. ఎందుకంటే.. ఇటీవల ఆంధ్రజ్యోతి పత్రిక కొందరిన ఉద్యోగాల్లోంచి తీసేసింది. మరోవైపు ఉన్న ఉద్యోగులకు జీతాల్లో కోతలు విధించింది. అయితే ఇప్పుడు ఈ విషయం కేసీఆర్ ముందు చర్చకు వచ్చింది. లాక్ డౌన్ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించిన కేసీఆర్ కు చివరలో కొందరు పాత్రికేయులు తమ యాజమాన్యాలు చేస్తున్న అన్యాయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు.

 

 

దీంతో కేసీఆర్ ఆశ్చర్యపోయారు. మీ యాజమాన్యాలు మీకు జీతాలు ఇస్తలేవా అని ప్రశ్నించారు. దానికి కొందరు జర్నలిస్టులు కోతలు వేశారని చెప్పారు. దాంతో కేసీఆర్ .. మరీ ఇంత అన్యాయమా.. ఇదే పద్దతి అంటూ ఆశ్చర్యపోయారు. అలాంటిదేమైనా ఉంటే.. నాకు ఓ కాగితం ముక్కపై కంప్లయింట్ ఇవ్వండి చర్య తీసుకుంటా అని అన్నారు. దీనిపై మరింతగా చర్చ జరగబోతున్న సమయంలో కేసీఆర్.. ఇక్కడ ఎందుకు.. మీకు ఏమాత్రం ఇబ్బంది వచ్చినా.. ఒకరిద్దరు వచ్చి నాతో చెప్పండి.. తప్పకుండా యాక్షన్ తీసుకుంటా అన్నారు.

 

 

పత్రికల్లో ఆంధ్రజ్యోతి జీతాలు కోసిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ఆంధ్రజ్యోతి పాత్రికేయులు ఈ విషయంపై సీఎం కేసీఆర్ కు కంప్లయింట్ ఇస్తారా.. అంత ధైర్యం చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. పాత్రికేయులు ధైర్యం చేసి కంప్లయింట్ ఇస్తే మాత్రం తగిన చర్యలు తీసుకునేందుకు కేసీఆర్ సిద్దంగానే ఉండే అవకాశం ఉంది.

 

 

ఎందుకంటే.. ఇటీవల ఆంధ్రజ్యోతి పత్రిక కేసీఆర్ ను కొన్ని విషయాల్లో సవాల్ చేసింది.. బరాబర్ రాస్తాం.. ఏం చేసుకుంటారో చేసుకోవచ్చు అనే రేంజ్‌ లో కేసీఆర్ కు ఆర్కే తన కొత్త పలుకు శీర్షిక ద్వారా సవాలు విసిరారు. చూడాలి ఏం జరుగుతుందో..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: