భూమంత ప్రేమ.. ఆకాశమంత రక్షణ.. ఇచ్చేది ఒక్క అమ్మ ప్రేమ.. అందుకే అమ్మను కనిపించే దైవం అంటారు..తొమ్మిది నెలలు మోసి, మనకంటూ ఒక రూపాన్ని ఇచ్చి ప్రేమను ప్రేమ కన్నా ఎక్కువగా పంచి.. మన కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే..తన కంట్లో నీళ్ళు తిరుగుతాయి.. మనకు ఆకలేస్తే తన కడుపు మండుతుంది.. మన చిరు నవ్వును తన ఆస్తి గా భావించి..కాపాడుతున్న అమ్మ ప్రేమ ముందు అన్నీ బలాదూర్.. 

 

 

 

 

 

తన రక్తాన్ని పంచి, శరీరాన్ని సృష్టించి లోకానికి నా బిడ్డ అనే ఒక గుర్తింపును అందిస్తుంది.. రెండు అక్షరాల వెనక ఎంతో ప్రేమ దాగి ఉంది..ప్రపంచం ఎవరికి లేని అదృష్టం అమ్మ ఉన్న వాళ్లకు దక్కుతుంది.. అది నిజమే.. డబ్బులున్నవాడికి సెక్యూరిటీ ఉంటుంది.. కానీ ధనవంతుల కైన పేదవాడికి అయిన కూడా సమానంగా దొరికే ప్రేమ అమ్మ అనురాగం.. తన శరీరాన్ని పంచి, జన్మను ఇచ్చి అలానా పాలనా చూసి, మనల్ని తీర్చి దిద్దుతుంది.. మన అమ్మ ...ఒక్కో అడుగు మనం వేస్తుంటే మురిసి పోతుంది.. చదువు కొనే వయసుకు మన వెన్నంటి ఉండి .. విద్య బుద్దులు నేర్పిస్తుంది.. పెళ్లి చేసుకొని వెళ్ళాక కన్నీటిని దిగమింగుకుని నా బిడ్డ సంతోషంగా ఉంటె చాలు అని ఆలోచిస్తుంది.

 

 

 

భూమ్మీద ఖరీదు కట్టలేనిది అమ్మ ప్రేమ .. ఎన్ని కోట్లు పోసిన ఆ ప్రేమ దక్కదు.. అందుకే ఎక్కడికైనా వెళ్లే తప్పుడు అమ్మకు నమస్కరించడం మన భారతీయ సంస్కృతీ..దేవుడి అందరినీ చూసుకోలేక అమ్మను సృష్టించాడు.. ప్రతి కుటుంబాన్ని కాపలా కాసే బాధ్యతను అమ్మకు అప్పగించాడు.. కోట్లకు పడగలెత్తే వాడైన .. గంజి పోసుకొని తాగే వాడికైనా కూడా అమ్మ ప్రేమలో మార్పు ఉండదు.. 

 

 

 

 

 

ఈ ప్రపంచంలో దేశాన్ని ఏలే రాజైన , ముల్లోకాలను కాపాడే దేవుడైన కూడా అమ్మ ప్రేమ ముందు చిన్నవాళ్లే.. అందుకే అమ్మను దైవం లాగా పూజిస్తారు.. అమ్మ కళ్ళలో సంతోషాన్ని చూసే వాళ్ళు నిజంగా అదృష్టవంతులు అని చెప్పాలి.. వృద్ధాశ్రమంలో తల్లులను వదిలేసే వా ళ్లు నిజంగానే గాడిదలు అని పెద్దలు చెబుతుంటారు.. దయచేసి అమ్మ ప్రేమలోని మాధుర్యాన్ని పొందండి.. అమ్మను ఆరాధించండి.. హ్యాపీ మదర్స్ డే.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: