ఎక్కన నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు నాయకుడు అంటాడు పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో కానీ.. అలా అని చెప్పి మరీ ఆత్మగౌరవం లేకుండా ఉండటం కూడా కరెక్టు కాదేమో అనిపిస్తుంది.. ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు విషయం చూస్తుంటే.. ఆయన కొంతకాలంగా మోడీని ప్రసన్నం చేసుకుందామని తెగ ప్రయత్నిస్తున్నా.. మోడీ మాత్రం చాలా లైట్ గా తీసుకుంటున్నారు.

 

 

తాజాగా విశాఖ గ్యాస్ దుర్ఘటన తర్వాత తనను విశాఖ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి చంద్రబాబు దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ.. దాన్ని మోడీ ఏమాత్రం పట్టించుకోలేదు. అయినా సరే.. చంద్రబాబు దాన్ని చాలా లైట్ గా తీసుకున్నారు. అంతే కాదు.. ఈ ఘటన విషయంలో ప్రధాని మోడీ బ్రహ్మాండంగా స్పందించారని ఉత్తరం కూడా రాశారు. అంటే.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మంచి చేసుకోవడానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదన్నమాట.

 

 

విశాఖ గ్యాస్ లీక్ ఘటన నేపథ్యంలో ఆయన ప్రధానికి రాసిన లేఖలో మోడీని అంతగా పొగిడారు. ఎల్జి పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై ప్రధాని స్పందించిన తీరును మనస్పూర్తిగా అబినందిస్తున్నానన్నారు. సత్వరమే మీరు స్పందించి చేపట్టిన చర్యలు విశ్వాసాన్నిచ్చాయన్నారు. గ్యాస్ లీకేజీపై విచారణకు సైంటిఫిక్ కమిటీని ఏర్పాటు చేయాలని... విషవాయువు విడుదలకు దారితీసిన అంశాలపై దర్యాప్తు చేయించాలని ఆయన కోరారు.

 

 

అంతే కాదు... ఈ విషయంపై అంతర్జాతీయ వైద్య నిపుణులతో పరిశీలనలు జరిపించాలన్నారు. తక్షణ, దీర్ఘకాలిక వైద్య చర్యలు చేపట్టాలన్నారు. అంటే ఈ ఉత్తరం ద్వారా చంద్రబాబు ఏం ఆశిస్తున్నారు.. అటు మోడీని పొగడాలి.. ఇటు రాష్ట్రం ఏమీ చేయలేదని చెప్పాలి.. అంతేగా.. కానీ.. పాపం.. మోడీ ప్రసన్నత కోసం చంద్రబాబు ఎన్ని మెట్లు దిగినా... ఆయన మాత్రం పట్టించుకోవడమే లేదంటున్నారు విశ్లేషకులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: