తాజాగా విద్యుత్ చార్జీలపై జగన్మోహన్ రెడ్డి  సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. విద్యుత్ చార్జీలను భారీగా పెంచుతూ సామాన్యుడి కి షాక్ ఇచ్చింది. అయితే ప్రస్తుతం కరోనా  అలాంటి క్లిష్టపరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచడం పై అటు జగన్మోహన్ రెడ్డి సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు సామాన్య ప్రజల నుంచి కూడా వ్యతిరేకత ఎదురవుతోంది. ఇక ప్రతిపక్ష పార్టీలు అయితే అధికార పార్టీపై విద్యుత్ చార్జీలు పెంచిన కారణంగా దుమ్మెత్తి పోస్తున్నాయి. ప్రతిపక్ష టిడిపి బిజెపి పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. 

 


 అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ విద్యుత్ ఛార్జీల పెంపుకు  తీసుకున్న నిర్ణయంపై బిజెపి ఎంపీ సీఎం రమేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తుంది అంటూ అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా దీనిపై సీఎం రమేష్ కూడా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కరెంటు ముట్టు కోవలసిన పనిలేదని కరెంటు బిల్లులు ముట్టుకుంటే చాలు షాక్ కొడుతుంది అంటూ వ్యాఖ్యానించారు సీఎం రమేష్. 

 


 ఎందుకంటే సామాన్య ప్రజలు అందరికీ షాక్ కొట్టే రీతిలో విద్యుత్ ఛార్జీలను జగన్మోహన్ రెడ్డి సర్కార్ పెంచిందని... అంతేకాకుండా విద్యుత్ శ్లాబ్ ను  75 యూనిట్లకు తగ్గించారు అంటూ ఆరోపించారు బిజెపి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్. ఇక జగన్ మోహన్ రెడ్డి సర్కారు తీసుకున్న విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజానీకం మొత్తం వ్యతిరేకిస్తుంది అంటూ తెలిపారు. ఇక ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయం పై నిరసనలకు ఏపీ బీజేపీ పిలుపునిచ్చింది అంటూ తెలిపారు. ఈ మేరకు తాను నిరసన దీక్ష చేపట్టినట్లు  బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి సర్కార్ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: