ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సీఎం జగన్ కు సవాల్ విసిరారు. ఏ విషయంలో అంటారా.. ఇటీవల విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ అనుమతుల విషయంలో.. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమకు ఎవరి హయాంలో ఏ అనుమతులు వచ్చాయన్న దానిపై చర్చకు ముందుకు రావాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఈ పరిశ్రమకు అనుమతులు ఇచ్చినవన్నీ కాంగ్రెస్‌ ప్రభుత్వాలేనని అంటున్నారు.

 

 

సీఎం జగన్.. అసలు విషయాలు దాచిపెట్టి పచ్చి అబద్ధాలకోరుగా టీడీపీపై దుష్ప్రచారానికి తెగబడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ‘ఎల్జీ పాలిమర్స్‌ ప్రస్తుతం వినియోగిస్తున్న 219 ఎకరాల భూ మిని 1964లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కేటాయించిందని చంద్రబాబు అంటున్నారు. ఈ భూమికి అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ చట్టం నుంచి 1992లో మినహాయింపు ఇచ్చినప్పు డూ కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఉందని గుర్తు చేస్తున్నారు. టీడీపీ హయాంలో ఒక్క ఎకరం కూడా ఎల్జీకి కేటాయించలేదని స్పష్టం చేస్తున్నారు చంద్రబాబు.

 

 

అంతే కాదు.. వైఎస్‌ ప్రభుత్వం 2007లో ఈ పరిశ్రమకు పర్యావరణ అనుమతులు ఇచ్చిందని చంద్రబాబు అంటున్నారు. 2009లో అదే ప్రభుత్వం మరోసారి అనుమతులు ఇచ్చిందట. 2012లో కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వం రెండుసార్లు అనుమతులు ఇచ్చిందట. టీడీపీ ప్రభుత్వం గత ప్రభుత్వాలు ఇచ్చిన అనుమతులను రెన్యువల్‌ చేసింది తప్ప కొత్తగా అనుమతి ఇవ్వలేదట. పైగా పాలి స్టైరిన్‌, ఎక్స్‌పాండబుల్‌ పాలి స్టైరిన్‌ ఉత్పత్తుల విస్తరణకు అనుమతి నిరాకరించారట చంద్రబాబు.

 

 

కావాలంటే చూసుకోండి.. ఈ విషయాన్ని ఆ కంపెనీ తన అఫిడవిట్‌లో స్వయంగా తెలిపింది అంటున్నారు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టైరిన్‌ విస్తరణకు అవసరమైన అనుమతులకు పూర్తి సహకారం అందించిందని చంద్రబాబు అంటున్నారు. అయితే ఈ సవాల్ విషయంలోనూ చంద్రబాబు తన చాణక్యం చూపించారు. టీడీపీ హయాంలో అనుమతులు రెన్యువల్ చేయడం అంటే.. మళ్లీ అనుమతి ఇవ్వడం కాదా.. అంటే వైసీపీ నేతలు చెబుతున్నది కరెక్టే కదా..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: