ఈ మధ్య కాలంలో పలు రాష్ట్రాలలో సాధువుల హత్య సంచలనం అవుతున్న విషయం తెలిసిందే. వరుసగా సాధువుల హత్యలు జరుగుతుండడం పోలీసులకు సవాల్ గా మారిపోతుంది. అంతకుముందు ఉత్తరప్రదేశ్లో సాధువుల హత్య సంచలనం సృష్టించగా మొన్నటికి మొన్న మహారాష్ట్రలో జరిగిన సాధువుల హత్య కూడ  తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇక ఈ సాధువుల హత్య అనుమానాస్పదస్థితిలో జరుగుతుండడం పోలీసులకు పెనుసవాల్గా మారిందా. దీంతో ఈ సాధువులు హత్య మిస్టరీని పోలీసులు సవాల్గా తీసుకుని ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. 

 

 వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రలోని నాందేడ్ పట్టణంలో... ఇద్దరు సాధువుల మృతదేహాలు  అనుమానాస్పదస్థితిలో కనిపించటం  సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న సమయంలో సాధువుల మృతదేహాలు ఇలా అనుమానాస్పద స్థితిలో కనిపించటంతో ఎంతో మందిని  తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఘటన స్థలిలో  ఆమవాళ్లు  కూడా లభించకుండా దుండగులు సాధువులను అతి దారుణంగా హత్య చేసి వెళ్ళినట్లు పలువురు భావించారు. అయితే కుట్రపూరితంగా ఈ సాధువులు హత్య జరిగిందా లేదా మరేదైనా కారణంతో ఈ సాధువులను హత్య చేశారా అన్నది ప్రస్తుతం పోలీసులకు సవాల్ గా మారిన నేపథ్యంలో... పోలీసులు సత్వర చర్యలు చేపట్టి స్వల్ప వ్యవధిలో నిందితున్ని అరెస్టు చేశారు. 

 


 కాగా మహారాష్ట్రలోని నాందేడ్ పట్టణంలో జరిగిన సాధువుల హత్యకు సంబంధించి సంబంధం ఉంది అని భావిస్తున్న నిందితుడు  తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ఉన్నాడు అని గ్రహించిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. ఇక నిందితుని పై  తమదైన శైలిలో విచారణ జరపగా... కేవలం డబ్బుల కోసం మాత్రమే సాధువుల హత్య చేసినట్లు అంగీకరించాడు సదరు నిందితుడు . సాధువుల  హత్య కేసులో నిందితుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు ఆ తర్వాత అతను రిమాండ్కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: