ఒక్క హత్యను కప్పిపుచ్చడానికి వరుసగా తొమ్మిది హత్యలు చేసి దుర్మార్గుడు సంజయ్ నేర చరిత్ర గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.  కాగా, వరంగల్‌‌లో సంచలనం సృష్టించిన వలస కూలీల మర్డర్ మిస్టరీలో కొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 72 గంటల్లోనే కేసు మిస్టరీని చేధించిన పోలీసులు ప్రధాన నిందితుడు సంజయ్‌ను మీడియా ముందు ప్రవేశ పెట్టారు పోలీసులు. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో జరిగిన దుర్ఘటన అందర్నీ కలచి వేసింది. 9 మంది శవాలను గిన్నీ గోడౌన్ పక్కనున్న బావి నుంచి మృతదేహాలను బయటకు తీశారు. గోడౌన్ యజమాని ఫిర్యాదు మేరకు మే 21న కేసు నమోదు చేశారు పోలీసులు.

 

 

బావిలో నుంచి ముందుగా మక్సూద్, ఆయన భార్య, కుమార్తె, మనవడి శవాలను వెలికి తీసిన తర్వాత మరో ఐదు మృతదేహాలన బయటకు తీశారు. వీరందరినీ ఒకే వ్యక్తి సంజయ్ హత్య చేశాడని.. అయితే అతని లీస్ట్ లో మరో మర్డర్ కూడా ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బిహార్‌కు చెందిన రఫీకాతో ఢిల్లీలో ఓ ఫర్నీచర్ షాపులో పని చేస్తుండగా సంజయ్‌కి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య వివాహేతర సంబందానికి దారి తీసింది. 

 

 

కొన్ని రోజులకు రఫికా భర్త  కనిపించకుండా పోయాడు. నాలుగేళ్ల క్రితం నుంచి అతడు కనిపించకపోవడంతో ఆమె భర్తను అడ్డు తొలగించుకొని ఉండవచ్చని భావిస్తున్నారు.  ఆ తర్వాత రఫికాను కూడా హత్య చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం  నిందితుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడు. అతడి నుంచి పూర్తి సమాచారం రాబట్టే పనిలో పడ్డారు. మరోవైపు మొత్తం కుటుంబం హత్యకు గురికావడంతో రఫికా ముగ్గురు పిల్లలు ఇప్పుడు అనాథలుగా మారారు. అప్పటికే సంజయ్  నేర చరిత్రపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: