గత రెండు నెలలుగా కొవిడ్ 19 వ్యాధితో సతమతమవుతున్న భారతదేశానికి పాకిస్తాన్ దేశం నుండి ఎడారి మిడతల గుంపు తరలివచ్చి పరిస్థితులను దారుణంగా మారుస్తుంది. ఎడారి మిడతల గుంపు పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోకి ప్రవేశించి ఆయా రాష్ట్రాల రైతుల పంటలను నాశనం చేశాయి. బే ఆఫ్ బెంగాల్ నుండి పడమర వైపు బలమైన గాలులు వీస్తున్నాయని... అందుకే పాకిస్థాన్ ఎడారుల నుండి కోట్ల మిడతలు మన దేశం యొక్క ఉత్తర భారతదేశంలో ప్రవేశిస్తున్నాయని భారత ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ మిడతల దండు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తే... సమాధానం చెప్పలేని పరిస్థితి. ఒకవేళ మన తెలుగు రాష్ట్రాల్లో కి ఎడారి మిడతలు వచ్చాయా లేదా అని ఎలా గుర్తించాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. 


మనదేశంలో ఎడారి మిడతలు అస్సలు ఉండవు. ప్రస్తుతం వేరే దేశాల నుండి మా దేశంలో కి తరలి వస్తున్నవి ఎడారి మిడతలు. ఈ మిడతలకు ఒక ఖండం నుండి మరొక ఖండానికి వెళ్లగల శక్తి ఉంటుంది. ఇవి దండుగా వెళ్లాలంటే ఎక్కడో ఒకచోట కోలుకోలేని వినాశనాన్ని సృష్టిస్తాయని చెప్పుకోవచ్చు. ఎడారి మిడతలు తేమగా ఉన్న ప్రాంతాల్లో గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు రెండు వారాలలోనే పిల్లలుగా మారి అన్ని రకాల పంటలను చెట్లను మొక్కలను తింటూ అయిదారు సార్లు తమ పాత చర్మాన్ని విడుస్తూ పెద్దగా తయారవుతాయి. ఆఖరిగా చర్మం విడిచిన తర్వాత అవి చాలా పెద్ద మిడతలుగా మారుతాయి. ఈ విధంగా పెద్దగా తయారైన మిడతలు ఇతర ప్రాంతాల్లో కి ప్రవేశిస్తూ జీవనం సాగిస్తుంటాయి. 


అయితే ఈ పెద్ద మిడతలు వేరే ప్రదేశంలోకి వెళ్ళి అక్కడి స్థానిక మిడతలతో కలిసినప్పుడు వాటి ప్రవర్తన వినాశకరంగా మారుతుంది. అప్పుడే ఆ మిడతల అన్ని కలిసి ఒక దండు గా ఏర్పడతాయి. గాలివాటంగా ఈ రోజుకి వంద కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేయగలవు. నిలువుగా రెండు కిలోమీటర్ల ఎత్తులో ఎగర గల శక్తి వీటికి ఉంటుంది. ఇకపోతే ఎడారి మిడతలు నాలుగు రకాలుగా ఉంటాయి. పుట్టిన కొన్ని రోజుల తర్వాత అది రెక్కలు లేని ఒంటరి మిడతలుగా జీవిస్తాయి. ఇవి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. రెండవ దశలో రెక్కలు లేకుండా ఉన్న ఎడారి మిడతలు నలుపు, ఆకుపచ్చ రంగులో ఉంటాయి. మూడవ దశలో ఎడారి మిడతలు రెక్కలు రావడంతో పాటు అవి గోధుమ రంగులోకి మారతాయి. ఇక చివరి దశ అయిన ప్రౌఢ దశ ఎడారి మిడతలు పసుపు పచ్చ రంగులోకి మారతాయి.

అయితే మనదేశంలో జీవించే జిల్లేడు మిడతలు జిల్లేడు మొక్కలపై ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి ఆకుపచ్చ రంగులో ఉండి పైన పసుపుపచ్చ గీతలను కలిగి ఉంటాయి. బొంబాయి మిడతలు గోధుమ రంగు లో ఉండగా... వాటిని మనం గతంలో ఎన్నోసార్లు చూసాము. అవి అన్ని మొక్కలపై కనిపిస్తాయి. కేరళలో కనిపించిన కాఫీ మిడతలు తూనీగల్లాగానే ఉంటాయి. వీటిని గుర్తించడం చాలా సులభం.

మరింత సమాచారం తెలుసుకోండి: