ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని రోజుల క్రితం హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను కరోనా రోగుల కోసం వినియోగించకూడదని కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తన వైఖరి మార్చుకుంది. హైడ్రాక్సీ క్లోరోక్విన్ తో కరోనా వైరస్ చికిత్స కోసం క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాలని సూచించింది. కరోనా రోగుల చికిత్సలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎంతో ఉపయోగపడుతుంది. భారత్ నుంచి పెద్దఎత్తున హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతులు జరిగాయి. 
 
విదేశాల్లోని వైద్యులు హైడ్రాక్సీ క్లోరోక్విన్ వినియోగం వల్ల గుండె, రక్తనాళాల వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందని చెప్పడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హైడ్రాక్సీ క్లోరోక్విన్ క్లినికల్ ట్రయల్స్ పై నిషేధం విధించింది. అనంతరం సేఫ్టీ డేటాను సమీక్షించి ట్రయల్స్ కొనసాగించేందుకు అంగీకరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మరణాల సమాచారాన్ని విశ్లేషించి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. గత ప్రణాళిక ప్రకారమే ట్రయల్స్ కొనసాగుతాయని పేర్కొంది. 
 
హైడ్రాక్సీ క్లోరోక్విన్ వినియోగం వల్లే భారత్ లో మరణాల రేటు తక్కువగా ఉండటంతో పాటు కరోనా రోగుల రికవరీ రేటు ఎక్కువగా ఉంది. దీర్ఘకాలిక వ్యాధుల భారీన పడిన వారు మాత్రమే ఎక్కువగా కరోనా భారీన పడి చనిపోతున్నారు. ఐ.సీ.ఎం.ఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ ప్రపంచ ఆరోగ్య సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు. 
 
హైడ్రాక్సీ క్లోరోక్విన్ తో క్లినికల్ ట్రయల్స్ లో సానుకూల ఫలితాలు వెలువడితే ప్రపంచ దేశాల ప్రజలకు మేలు చేకూరుతుందని చెపారు. దశాబ్దాలుగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను వినియోగిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా ప్రపంచ ఆరోగ్య సంస్థ తీసుకున్న నిర్ణయం సరైన దిశగా వేసిన ముందడుగు అని అభిప్రాయపడ్డారు. వైద్యుల సూచనల మేరకు ఈ మందును వాడితే ఎటువంటి సమస్యలు ఉండవని చెప్పారు.     

మరింత సమాచారం తెలుసుకోండి: