పైకి ఎంతో ప్రశాంతంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నా తెలుగుదేశం పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా అధికార పార్టీ దెబ్బకు తెలుగుదేశం పార్టీ నాయకులంతా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారట. ప్రస్తుతం అధికార పార్టీ ఆపరేషన్ టిడిపి కార్యక్రమాన్ని చేపట్టింది. తెలుగుదేశం పార్టీని లేకుండా చేసే ఉద్దేశం లో భాగంగా గత టీడీపీ ప్రభుత్వంలో నెలకొన్న అక్రమాలను బయటకు తీస్తున్నారు. ఒక్కో టీడీపీ కీలక నాయకుడిని తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు పంపడమే కాకుండా, జైలుకు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు గా వ్యవహరిస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీలో ఎక్కడలేని భయాందోళనలు నెలకొన్నాయి.

 

IHG


పార్టీలో ఉన్న నాయకులు ఎవరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేసేందుకు ఇష్టపడడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా ఆషామాషీగా వదిలిపెట్టేదని, వెంటాడి వేధిస్తుంది అనే భయం తెలుగు తమ్ముళ్లలో నెలకొంది. సాక్షాత్తు పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చినా, ధర్నాలు ఆందోళనలు చేపట్టేందుకు తెలుగు తమ్ముళ్లు ముందుకు రావడం లేదు. ప్రతి జిల్లాలోనూ పరిస్థితి ఇదే రకంగా ఉండటంతో రానున్న నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశాన్ని కోల్పోవాల్సి వస్తుందేమోనని చంద్రబాబు అనుమానిస్తున్నారు. 

 

ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ కారణంగా నాయకులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు వెనకడుగు వేస్తున్నారెమో అనుకున్నా అసలు విషయం మాత్రం వైసీపీ పై ఉన్న భయందోళనలే కారణమట. వైసీపీ ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా ఉన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టే లా కనిపించడం లేదు. ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు జైలుపాలయ్యారు. ఇంకా ముగ్గురు, నలుగురు మాజీ మంత్రులకు ఇదే పరిస్థితి వచ్చే అవకాశం కనిపిస్తుండడంతో తెలుగు తమ్ముళ్ల లో ఆందోళనలు పెరిగిపోతున్నాయి. అందుకే వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడా ప్రభుత్వాన్ని విమర్శించేందుకు సాహసం చేయలేకపోతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: