ప్రస్తుతం చైనా భారత్ తో  యుద్ధం చేసేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. భారత్ చైనా సరిహద్దు లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొన్నటికి మొన్న ఏకంగా భారత సైన్యానికి చెందిన 20 మంది సైనికులు కూడా చనిపోవడంతో  అటు భారత్లో కూడా యుద్ధ వాతావరణం ఎలా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం భారత్ విషయంలో చైనా ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అందుకే వ్యూహాత్మకంగా భారత్ కూడా వ్యవహరిస్తుందని అంటున్నారు విశ్లేషకులు. చైనా  కొన్ని ఆర్థికంగా లోటు పాట్లు ఉన్న దేశాలకు ఆర్థిక సాయం చేస్తూ తన చెప్పుచేతల్లో పెట్టుకుంటుంది చైనా. 

 

 భారత్ చుట్టూ ఉన్న దేశాలు తమ ఆధీనంలోకి తీసుకుంటుంది . ఇప్పటికి శ్రీలంకకు ఆర్థిక సహాయం చేసే తమ ఆధీనంలోకి తెచ్చుకుంది అదే సమయంలో నేపాల్ కూడా సామంత దేశంగా మారింది . పాకిస్థాన్ కూడా చైనా చెప్పు చేతల్లోనే ఉంది. టిబెట్ కూడా ప్రస్తుతం చైనా దేశం ఆధీనంలోనే ఉంది.భారత్  చుట్టూ ఉన్న దేశాల ను చైనా  తమ అధీనంలోకి తెచ్చుకుని భారతదేశానికి ఎప్పటికప్పుడు వార్నింగ్ లు ఇస్తూ ఉంది. అయితే ఎంతో ప్రణాళికాబద్ధమైన వ్యూహంతో చైనా ముందుకు సాగుతుంటే అదే వ్యూహాన్ని తిప్పి కొడుతుంది ప్రస్తుతం భారత్. చైనా తరహా వ్యూహాన్ని  ప్రస్తుతం భారత్ అమలు చేస్తోంది.

 


 వాస్తవానికి అయితే భారత్-చైనా లాగా మిగతా దేశాలకు ఆర్థికంగా సహాయం చేసి వాటిని తమ చేతుల్లోకి తెచ్చుకోలేదు. అయితే సాంస్కృతిక పరంగా చూసుకుంటే నేపాల్ భారత దేశానికి ఎంతో దగ్గరగా ఉండేది. టిబెట్ శ్రీలంక దేశాలు  భారత్ కి సపోర్ట్ గా ఉండేది కానీ ఆర్థికంగా చైనా సహాయం చేయడంతో అటువైపు వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం భారత దేశం చుట్టూ చైనా ఒక గీత గీసినట్లు  గానే... అటు చైనా చుట్టూ కూడా భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. హాంకాంగ్ వియత్నాం దక్షిణ కొరియా తైవాన్ జపాన్ ఫిలిప్పీన్స్ భూటాన్  టిబెట్  లాంటి దేశాల్లో తమ సంబంధాలను కొనసాగిస్తూనే.. బంగ్లాదేశ్ మయన్మార్ దేశాలతో రాపో  కొనసాగిస్తుంది భారత్.

మరింత సమాచారం తెలుసుకోండి: