భారత్ చైనా విషయంలో కఠినంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. గల్వాన్ ఘటన తరువాత భారత్ డ్రాగన్ కు వరుస షాకులిస్తోంది. చైనాను ధీటుగా ఎదుర్కోవడానికి ఇప్పటికే పెద్ద ఎత్తున ఆయుధాలను కొనుగోలు చేసిన భారత్ చైనా యాప్ లను బహిష్కరిస్తూ.... ఆ దేశం కంపెనీలతో గతంలో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటూ డ్రాగన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వరుస షాకులతో చైనాకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. 
 
చైనా దేశానికి భారత్ రిటర్న్ గిఫ్టులు ఇస్తోంది. సరిహద్దు దగ్గర చైనా సైనికులు మన సైనికులను 20 మందిని చంపితే మనం ఆ దేశానికి చెందిన సైనికులను రెట్టింపు సంఖ్యలో మట్టుబెట్టాం. ఈ ఘటన తరువాత భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు చైనాకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. చైనాకు భారత్ వినాయక చవితి, దీపావళి పండుగల ఉత్పత్తుల విషయంలో బ్రేక్ వేయనుంది. భారత్ చైనా వినాయక విగ్రహాలకు కానీ, రాఖీలకు కానీ ఈ సంవత్సరం అనుమతులు ఇవ్వబోదని సమాచారం. 
 
మన దేశంలోని దీపావళి టపాకాయలలో సగానికి పైగా చైనా నుంచి దిగుమతి చేసుకుంటారు. వాటిని కూడా తాజాగా భారత్ నిషేధించిందని తెలుస్తోంది. భారత్ లో ఉన్న సంస్థల నుంచి వీటిని ఉత్పత్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రతి సంవత్సరం ఈ ఉత్పత్తుల ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించే చైనాకు నష్టం చేకూరనుంది. చైనా ఆర్థిక వ్యవస్థను బలహీనపరచటానికి భారత్ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. 
 
ఈ నిర్ణయం వల్ల మన దేశంలో టపాకాయలు, రాఖీలు, వినాయకుని ప్రతిమలు తయారు చేసే వాళ్లకు ప్రయోజనం చేకూరనుంది. చైనాకు చెక్ పెడుతూ అదే సమయంలో భారత్ స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తోంది. మన దేశంలో తయారయ్యే ఉత్పత్తులను చైనా నుంచి ఎట్టి పరిస్థితుల్లోను దిగుమతి చేసుకోరాదని మోదీ సర్కార్ భావిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: