బాల్యంలో నీతి కథల్లో జిత్తులమారి నక్క గురించి మనం తరచూ కథలు వినేవాళ్లం. ఆ కథల్లో జిత్తులమారి నక్క ఎలా వ్యవహరిస్తుందో ప్రస్తుతం చైనా కూడా అదే విధంగా వ్యవహరిస్తోంది. వ్యాపారాల్లో ఎత్తుకు పై ఎత్తులు అవసరం. కానీ చైనా జిత్తులమారిగా మారి కొత్త బిజినెస్ స్ట్రాటజీలను మొదలుపెట్టింది. చైనా భారత్ యాప్ లను నిషేధించటంతో తీవ్రంగా కోపం పెంచుకుంటోంది. కాంట్రాక్టులను రద్దు చేయడంతో పాటు పలు ఉత్పత్తులపై భారత్ నిషేధం విధించింది. 
 
టెలికాం, విద్యుత్ ఉత్పత్తుల విషయంలో ఏవీ కొనుగోలు చేయకూడదని భావిస్తోంది. భారత్ తీసుకున్న పలు నిర్ణయాల వల్ల చైనాకు 2 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లనుంది. భారత్ నిర్ణయాల వల్ల ఆ దేశంలో ఉపాధి అవకాశాలు దెబ్బ తిన్నాయి. భారత్ ఆన్ లైన్ ఉత్పత్తుల విషయంలో ప్రతి ఉత్పత్తి మీద తయారైన దేశం పేరు ఉండాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రపంచీకరణలో భాగంగా మనకు ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి చైనా వస్తువులను పూర్తిగా నిషేధించనుంది. 
 
చైనా వస్తువులపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వస్తోంది కాబట్టి డ్రాగన్ కొత్త బిజినెస్ స్ట్రాటజీ మొదలుపెట్టింది. అయితే చైనా ఇకపై ఉత్పత్తులు చైనాలో తయారైనా మేడ్ ఇన్ చైనా బదులు మేడ్ ఇన్ పీఆర్సీ అని పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రయత్నంతో చైనా కొత్తగా మార్కెట్ ను సృష్టించుకోవాలని భావిస్తోంది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అనే పేరు పెట్టుకోవాలని చైనా భావిస్తోంది. 
 
చైనా ఈ విధంగా ఒక కొత్త ఎత్తుగడను అమలులోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తోంది. అయితే చైనా చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయనే విషయం మాత్రo చెప్పలేము. చైనా ఇలాంటి ఎన్ని ఎత్తులు వేసినా మన దేశ ప్రజలు కూడా చైనా ఎత్తులను చిత్తు చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: