అయితే కరోనా వైరస్ ప్రస్తుతం మనుషుల ధైర్యాన్ని చంపేస్తుంది. కరోనా భయంతో ఎంతో మంది గుండె ఆగిపోతుంది. కరోనా సోకకుండానే ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటుంది ఈ రక్కసి. భయంతో మనస్థాపం చెంది మరణించిన సంఘటనలు చాలానే వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కరోనా భయంతో బలవన్మరణాలకు కూడా పాల్పడుతున్నారు. తాజాగా ఎక్కడ ఇలాంటి ఘటన జరిగింది, కరోనా వైరస్ భయం తో మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
అసన్ పర్తి లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలో ఓ మహిళకు పాజిటివ్ అని వచ్చింది, సదరు మహిళకు వైద్య సిబ్బంది కరోనా కిట్ అందజేశారు. తాను హోమ్ ఐసొలేషన్ లో ఉంటానని వైద్య సిబ్బందిని ఒప్పించిన సదరు మహిళ ఇంటికి బయలుదేరింది. కరోనా సోకడంతో ఆమె ధైర్యం భయం గా మారింది.. తీవ్ర మనస్తాపం చెందింది. నడుచుకుంటూ వెళుతున్న సమయంలోనే తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. వెంటనే అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ.. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. ఆ మహిళ మృత్యువాత పడింది.
Powered by Froala Editor
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి