కరోనా విజృంభణ మామూలుగా లేదు. తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ అదే పరిస్థితి. ఇప్పటికే చాలామంది ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. వారిలో చాలా మంది కోలుకున్నారు కూడా. తెలంగాణ విషయానికి వస్తే .. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సైతం కరోనా బారిన పడ్డవారే. మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరికి కూడా కరోనా వచ్చినట్టు తేలింది.

తాజాగా.. హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కు కూడా కరోనా వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే కరోనా వచ్చిన టీఆర్ఎస్ నేతల జాబితా బాగానే పొడవు వచ్చేలా ఉంది. అయితే.. కరోనాకు భయపడాల్సిన అవసరమే లేదంటున్నారు సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి.

కరోనాతో సహజీవనం తప్పదని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తేల్చి చెప్పారు. తన ఇంటిలోనే ఆరుగురి కరోనా వచ్చిందని ఆయన స్వయంగా తెలిపారు. వైద్యుల సూచనలతో, మనోదైర్యంతో కరోనాను జయించవచ్చని గుత్తా పిలుపు ఇచ్చారు.

గుత్తా ఇంట్లో మొదట ఆయన కొడుకు, కోడలికి పాజిటివ్ వచ్చిందట. 15 రోజుల్లో మళ్లీ నెగిటివ్ వచ్చిందట. ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని గుత్తా సూచిస్తున్నారు. అందరూ చెబుతున్నది ఇదే. ఇప్పుడు పెద్దగా లక్షణాలులేని కరోనా తెలంగాణలో ఎక్కువగా వ్యాపిస్తోందన్నది ఓ విశ్లేషణ.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి