ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ బీజేపీ చీఫ్ గా కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ ఉద్వాసన పలికింది. ఆయన స్థానంలో సోము వీర్రాజుకు పగ్గాలు అప్పగిస్తూ నిర్ణయం ప్రకటించింది. ఉరుములేని పిడుగులా వచ్చిన ఈ వార్త సొంత పార్టీ వర్గాలనే ఆశ్చర్యపరుస్తోంది.

మరి కన్నా లక్ష్మీనారాయణను ఎందుకు తొలగించినట్టు.. ఈ అంశాన్ని పరిశీలిస్తే.. అందులో మొదటిది... ప్రధానంగా కనిపించేది చంద్రబాబుతో స్నేహం.. కన్నా- చంద్రబాబు స్నేహితులను అని చెప్పేందుకు గట్టి ఆధారాలు లేకపోయినా.. ఆయన బీజేపీ చీఫ్ గా కాకుండా చంద్రబాబు అనుచరుడుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు బాగా వచ్చాయి.

రెండో కారణం.. ఆయన పార్టీని ఆశించినంత బలంగా నడిపించకపోవడం.. కేంద్రంలో అధికారంలో ఉన్నా.. ఆయన పార్టీలో ఉత్సాహం నింపలేకపోయారు. మూడో కారణంగా.. ఆయన పార్టీలో వర్గాలను ప్రోత్సహించడం.. ఆయన కేవలం కొందరి నాయకుడుగా మారారు. కొందరిని పూర్తిగా పక్కకు పెట్టారన్న అసంతృప్తి పార్టీలో కనిపించింది.

నాలుగోది.. పార్టీలో కన్నా పోరాటంలో వ్యూహాత్మకలోపం.. రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ బలంగా ఉంది. ఆ పార్టీపై వ్యతిరేకత వచ్చేందుకు ఇంకా చాలా సమయం పట్టొచ్చు. ఈ లోపు ప్రధాన ప్రతిపక్షం స్థానాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించకుండా అధికార పార్టీతో కయ్యం పెట్టుకోవడం.

ఐదోది.. పార్టీలో ఆయన ప్రత్యర్థులు బలంగా ఉండటం.. సోము వీర్రాజు వంటి నేతలు మొదటి నుంచి దూకుడుగానే ఉన్నారు. వారు అటు టీడీపీనీ, ఇటు వైసీపీనీ విమర్శిస్తూ.. ఓ వ్యూహం ప్రకారం వెళ్తున్నారు. ఈ సమయంలో కన్నా కంటే.. సోము వీర్రాజు బెటర్ అని అధిష్టానం భావించడమే ఈ అనూహ్య పరిణామానికి కారణంగా చెప్పొచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి