దేశంలో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. కరోనా, లాక్ డౌన్ వల్ల ఎప్పుడూ లాభాల్లో ఉండే ప్రైవేట్ బ్యాంకులు నష్టాల బాట పట్టాయి. కరోనా మహమ్మారి, లాక్ డౌన్ సమయంలో కార్యకలాపాలు లేకపోవడం, డిజిటల్ పేమెంట్స్ ఎక్కువ సంఖ్యలో జరగినా వాటికి చార్జీలు లేకపోవడం వల్ల ప్రైవేట్ బ్యాంకులకు నష్టాలు వాటిల్లాయి. ఈ నష్టాలను అధిగమించాలనే ఉద్దేశంతో ప్రైవేట్ రుణ సంస్థలు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నాయి.
 
ఇప్పటికే పలు బ్యాంకులు ఖాతాదారుల నుంచి వివిధ రకాల ప్రాసెసింగ్ ఫీజులను వసూలు చేస్తున్నాయి. తాజాగా పలు ప్రైవేట్ బ్యాంకులు తక్కువ విలువ కలిగి ఎక్కువ సంఖ్యలో జరిగే లావాదేవీలపై చార్జీలు విధించాలని భావిస్తున్నాయట. ప్రస్తుతం యూపీఐ యూపీఐ ట్రాన్సాక్షన్స్ పైన పర్సన్ టు పర్సన్ లకు, పర్సన్ టు మర్చంట్ లకు బ్యాంకులు ఎటువంటి చార్జీలు వసూలు చేయడం లేదు.
 
పలు బ్యాంకులు ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ లావాదేవీలకు చార్జీలు విధిస్తున్నా కొన్ని బ్యాంకులు మాత్రం విధించడం లేదు. ఇకపై ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీలపై కూడా చార్జీలు విధించాలని ప్రైవేట్ బ్యాంకులు భావిస్తున్నాయి. లావాదేవీ జరిపే బ్యాంక్, లావాదేవీ జరిపే మొత్తాన్ని బట్టి చార్జీలు వసూలు చేయాలని ప్రైవేట్ బ్యాంకులు భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది.
 
గడిచిన కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తోంది. లాక్ డౌన్ సమయంలో డిజిటల్ పేమెంట్స్ పెద్ద ఎత్తున జరిగాయి. కార్డ్స్, యూపీఐ, మొబైల్ వ్యాలెట్స్, బ్యాంక్స్ ప్రీపెయిడ్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి వాటి ద్వారా చేసే లావాదేవీలను డిజిటల్ లావాదేవీలని చెప్పవచ్చు. డిజిటల్ లావాదేవీలపై చార్జీలు విధిస్తే మాత్రం లావాదెవీలు జరిపే వాళ్లు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. ఫోన్ పే, గూగుల్ పే, భీమ్ యాప్ ల ద్వారా దేశంలో ఎక్కువ సంఖ్యలో డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి.


 


మరింత సమాచారం తెలుసుకోండి: