సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ కు కోర్టు ధిక్కరణ కేసులో ప్రశాంత్ ను ఒక రూపాయి జరిమానా ఖరారు చేసింది సుప్రీంకోర్టు. సెప్టెంబర్ 15 నాటికల్లా ఒక రూపాయిని కోర్టుకు డిపాజిట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ రూపాయి ఫైన్ చెల్లించని యెడల ప్రశాంత్ భూషణ్ కు మూడు నెలల జైలు శిక్ష తో పాటు,  ప్రాక్టీస్ పై మూడేళ్లు నిషేధాన్ని విధిస్తామని ప్రకటించింది. ధర్మాసనం తీర్పు లెక్క చేయకుంటే శిక్ష తప్పదంటూ హెచ్చరించింది సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం. ఈ త్రిసభ్య ధర్మాసనానికి జస్టిస్ అరుణ్ మిశ్రా అధ్యక్షత వహిస్తుండగా, జస్టిస్ బిఆర్ గవి, జస్టిస్ కృష్ణ మురారి లు సభ్యులుగా ఉన్నారు..




అయితే జస్టిస్ అరుణ్ మిశ్రా బుధవారం,సెప్టెంబర్ 2న పదవీ విరమణ చేశారు. ఇలా ఆయన పదవీ విరమణ చేయడం అందరికీ బాధ కలిగించింది. మధ్యప్రదేశ్ కు చెందిన జస్టిస్ మిశ్రా.. దాదాపు 21 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేశారు. ఈయనకు న్యాయ శాస్త్రం అంటే  ఉన్న మక్కువతో తన  కుమార్తెను కూడా లా చదివించారు. ఇప్పుడు ఆమె ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు.
ఈయన న్యాయవాదిగా ఉన్న సమయంలో 2018 సంవత్సరం లో చరిత్రలోనే మొట్టమొదటిసారిగా నలుగురు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు అయిన జస్టిస్ మదన్ భీమారావు, జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ కురియన్ జోసఫ్ లు ఓ మీడియా ముందు సుప్రీంకోర్టు న్యాయ విచారణను విమర్శిస్తూ ఆరోపణలు చేశారు.
ఈ విషయంపై జస్టిస్ అరుణ్ మిశ్రా ఎంతో ఆవేదన చెందారు. వారి ఆరోపణలు సబబు కాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇవే కాక రాజకీయపరమైన ముఖ్యమైన కేసులను ఈ విషయంలో సానుకూలంగా మార్చుకునేందుకు జూనియర్ న్యాయమూర్తులకు కేసులను అప్పగిస్తున్నారు అనే వార్తలు కూడా వినిపించాయి. ఓ కేసు విషయంలో ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న అరుణ్ మిశ్రా స్వయంగా ఆ కేసు నుండి తప్పుకుంటున్నట్లు బాహ్య ప్రకటన చేశారు. ఇదే కాక భూసేకరణ కేసులో కూడా ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నారు జస్టిస్ మిశ్రా. 




ఇలా ఎప్పుడూ ఏదో ఒక వివాదంతోనో లేదా ప్రశంసలతోనో వార్తల్లోకి ఎక్కువ ఉంటారు జస్టిస్ మిశ్రా. ఈమధ్య ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ అంతర్జాతీయ వేదికపై ఆయన పై ప్రశంసల వర్షం కురిపించారు మిశ్రా. ఈ విషయం అప్పట్లో చర్చనీయాంశం అయింది. ఇలా  జస్టిస్ మిశ్రా తన కెరియర్ రికార్డులో ప్రశంసలతో పాటు ఎన్నో వివాదాలు ఎదుర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: