ఇదే సమయంలో వైసీపీ సర్కారు చేస్తున్న పనులనూ ఆయన చెప్పుకొచ్చారు. సీఎం వైయస్ జగన్ నిబద్ధతకు ఇదే నిదర్శనం అంటూ కొన్ని ఉదాహరణలు చూపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైయస్‌ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద నెట్ వర్క్ ఆస్పత్రులకు 148.37 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని... ఉద్యోగులకు హెల్త్ స్కీం కింద 31.97 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమని అంతకు ముందు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
అంతే కాదు.. ఇటీవల నోబెల్ బహుమతులు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపైనా విజయసాయిరెడ్డి సెటైర్లు పేల్చారు. ఎదుటి పార్టీ ఎమ్మెల్యేలను వేలం ద్వారా కొనుగోలు చేయవచ్చు అని నిరూపించిన చంద్రబాబుకు నోబెల్ ఫ్రైజ్ ఇవ్వాలని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. అర్రె...వేలం పాటలో కొత్త థియరీ కనిపెట్టినందుకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సింది బాబు గారికి కదా! ఎవరికో ఇవ్వడమేంటి! వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బాబు ఎప్పుడో కొత్త వేలం విధానాన్ని కనిపెట్టిన సంగతి నోబెల్ కమిటీ దృష్టికి వెళ్లలేదా? ఇప్పటికైనా ఆయన పేరు చేర్చి న్యాయం చేయాలి అంటూ విజయసాయిరెడ్డి కామెంట్ చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి