తెలుగు రాష్ట్రాల వారికి దసరా ముఖ్యమైన పండుగ.. ప్రత్యేకించి తెలంగాణలో దసరా మహా పెద్ద పండుగ.. ఈ పండుగ సమయంలో వచ్చే బతుకమ్మ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక.. ఆ పండుగ 9 రోజులూ... తెలంగాణ మహిళలు సాయంత్రం నుంచి రాత్రి వరకూ బతుకమ్మ ఆడతారు.. బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడుతూ పాడుతారు.. అటు ఆంధ్రాలోనూ దసరా బాగానే జరుపుకుంటున్నారు. అయితే ఇప్పుడు కరోనా సమయంలో దసరా వేళ గుంపులుగా తిరిగితే కరోనా విజృంభించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.


ఇటీవల కేరళలో ఓనం పండుగ వచ్చింది. అది కూడా తెలంగాణ బతుకమ్మలాగానే సందడిగా ఉంటుంది. అయితే.. కేరళలో భారీగా కరోనా కేసులు నమోదుకావటానికి ఆ రాష్ర్ట ప్రభుత్వం ఓనమ్  పండుగ సందర్భంగా సరైన చర్యలు చేపట్టకపోవటమే కారణమట. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. అన్ -లాక్ డౌన్  నిబంధనలు సరైన రీతిలో అక్కడ పాటించలేదట. అనేక సేవలు పునః ప్రారంభించటం,విహార యాత్రలకు అనుమతించటంతో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడి కరోనా వైరస్  వ్యాప్తి పెరిగిందంటున్నారు  హర్షవర్ధన్  చెప్పారు.


కేరళలో కొవిడ్  కేసులు అధికంగా పెరగటం మిగిలిన అన్ని రాష్ర్టాలకు ఓ పాఠం అంటున్నారాయన. ఆయా రాష్ర్టాలు పండుగల సందర్భంగా కఠినచర్యలు తీసుకోవాలన్నారు. సోషల్  మీడియాలో ఆయన్ని అనుకరించే వారితో మాట్లాడిన హర్షవర్ధన్ ప్రతి ఒక్కరు ఇళ్లల్లోనే పండుగలు జరుపుకోవాలని కోరారు. దేశంలో కరోనా సామూహిక వ్యాప్తి కొన్ని రాష్ర్టాల్లోని కొన్ని జిల్లాల్లోనే వెలుగు చూసిందట. మరి ఇలాంటి సమయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండకపోతే.. కరోనా విజృంభించే అవకాశం లేకపోలేదు తస్మాత్ జాగ్రత్త.


హర్షవర్థన్ ఇంకా ఏమన్నారంటే.. దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో అవసరమైన ఆక్సిజన్  సిలిండర్లు అందుబాటులో ఉన్నాయట. డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తి పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందట. ఇంకో విషయం.. కరోనా సమయంలో వార్తపత్రికలు చదవటం పూర్తి సురక్షితమట. అదీ సంగతి.

మరింత సమాచారం తెలుసుకోండి: