అయితే లడక్ ప్రాంతంలో ఏం జరుగుతుంది అనే దానిపై ఇటీవలే భారత రక్షణ రంగ నిపుణులు నితిన్ గోకలే ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. గత కొన్ని రోజుల క్రితం లడక్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు -0 డిగ్రీల కంటే దిగువన ఉన్నాయి.. అధికారికంగా లడక్ ప్రాంతంలో శీతాకాలం ప్రకటించబడింది.. అయితే చైనా భారత సరిహద్దుల్లో మూడు వారాల నుంచి కమాండర్ స్థాయి చర్చలు జరగలేదు. ప్రస్తుతం ఇరు దేశాల సైన్యాలు తప్పనిసరిగా సరిహద్దుల్లో ఒకరినొకరు పరిశీలిస్తూ ఉండాల్సి వస్తుంది. 1962 తర్వాత ఇంత ఉద్రిక్త పరిస్థితులు ఇదే మొదటిసారి. భారత సేనలు అక్కడ సరిహద్దు ప్రాంతాల్లో సంవత్సరాలనుంచి పహారా కాస్తూ ఎంతో అనుభవం సాధించాయి కానీ చైనా సైనికులకు మాత్రం ఇది మొదటి అనుభవం.
ఇంత చలి ప్రాంతంలో చైనా సైనికులు ఎలా తట్టుకోవాలి పహారా కాస్తారు అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రస్తుతం చైనా చర్చలకు దిగకపోవడం చూస్తే అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నట్టు అభిప్రాయం వ్యక్తం చేశారు నితిన్ గోకులే. అయితే శీతాకాలంలోనే చైనా భారత తో యుద్ధానికి దిగుతుందా లేక వేసవికాలంలో యుద్దానికి దిగుతుందా అన్నది మాత్రం చర్చనీయాంశంగా మారింది అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేదాన్ని బట్టి చైనా ముందు ముందు ఎలా స్పందించాలి అనేది నిర్ణయించబడుతుంది అని ఆయన అంచనా వేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి