ఈ మరాఠి వంటలమ్మ  మనవడికి సరద తెచ్చిన ఆలోచనే ఆమెకి ఆదాయాన్ని తెచ్చింది. సరదాగా ఆలోచన రావడం ఏమిటి.. ? అలానే ఆ ఆలోచనే ఆదాయం తేవడం ఏమిటా అని అనుకుంటున్నారా.. ? మరి ఇప్పుడే చూడండి.  ఓ పావ్‌బాజీ ఆమె జీవితాన్నే మార్చేసింది ఒక ఆలోచన. మహారాష్ట్రకు చెందిన సుమన్‌ ధమని కి 70 ఏళ్ళు. ఈ అవ్వ ఇప్పుడు యూట్యూబ్‌ గా మారింది. ఈ అవ్వ వయసు పెరగడం తో ఇంట్లోనే  ఖాళీగా ఉండేది. 17 ఏండ్ల మనవడు యాస్‌ తన దగ్గరకి వచ్చి  ఏదో ఒకటి చేసిపెట్టమని ఆ పెద్దావిడను సతాయిస్తూనే ఉండేవాడు.

ఒక రోజు మాత్రం  పావ్‌బాజీ చేయమని అవ్వను బతిమాలాడు. తప్పుతుందా? వండి పెట్టింది. ఆ అవ్వ ఎంతో రుచిగా చేయడంతో ఆ మనవడికి ఒక ఐడియా వచ్చింది. ఇంకేం ఉంది ఆ ఆలోచనే అంత మార్చేసింది. మొత్తానికి ఆ మనవడు  అవ్వతో యూట్యూబ్‌ ఛానెల్ పెట్టి దానిలో దేశీ వంటలు చేయించాలనుకున్నాడు. ఇలా వీళ్ళు మార్చి 2019లో '  ఆప్లీ ఆజీ ' (Aapli Aaji) పేరుతో యూట్యూబ్‌ వంటల చానెల్‌ను ప్రారంభించారు . మరి సక్సెస్ అయ్యిందా అనే సందేహం పడొద్దు.

మొత్తం వ్యూస్‌ 6 కోట్లు. యూట్యూబ్‌ నుంచి బహుమతి కూడా అందుకుంది సుమన్‌ ధమని. దేశీయ వంటల తో అవ్వే ఇప్పుడు పాపులర్‌.  ఈ అవ్వ ఛానెల్ కి ఆరు నెలల్లోనే 5 వేల సబ్‌స్ర్కైబర్లను పొందగలిగాడు. అలానే ఇప్పటి వరకు  ఈ ఛానెల్ లో 150 వీడియోలు పోస్ట్ చేయడం జరిగింది.ఈ అవ్వ మామూలు అవ్వ కాదు. మనవడి సాయంతో కొన్ని ఇంగ్లిష్‌ పదాలు కూడా నేర్చుకుంది. తన వీడియోస్ తో  మహారాష్ట్ర లో పాపులర్‌ యూట్యూబ్‌ వంటలమ్మగా పేరు తెచ్చుకుంటున్నది ఈ అవ్వ. 

మరింత సమాచారం తెలుసుకోండి: