అయితే ట్రంప్‌కు మద్దతు తెలిపిన కుటుంబ సభ్యుల లిస్ట్‌లో ఆయన కుమార్తె ఇవాంక లేకపోవడం ఆసక్తికర పరిణామం. ఇది ఆశ్చర్యకరంగా ఉన్నా.. ఇదే నిజం. ఎన్నికల ఫలితాలపై తన తండ్రి చేస్తున్న ఆరోపణలను సమర్ధిస్తూ కొన్ని రోజుల నుంచి ఇవాంక ట్రంప్ సోషల్ మీడియాలో ఒక్కపోస్టు కూడా పెట్టలేదు సరికదా.. ఓటమిని అంగీకరించేలా ట్రంప్‌ను ఒప్పించే పనిలో ప్రస్తుతం ఆమె బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ట్రంప్ సన్నిహితులు కూడా స్పష్టం చేస్తున్నారు. హుందాగా ఓటమిని అంగీకరించాలని డొనాల్డ్ ట్రంప్‌కు అతని అల్లుడు జేర్డ్ కుష్నర్ కొద్ది రోజుల క్రితం సూచించారు. దీని వెనక కూడా ఇవాంక హస్తం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
వైట్‌హౌస్‌లో ప్రస్తుతం సైలెంట్ వార్ నడుస్తోంది. రెండు వర్గాలుగా ట్రంప్ కుటుంబం విడిపోయినట్లు తెలుస్తోంది. దీనికి పెద్ద కారణమే ఉంది. అదేంటంటే.. భవిష్యత్తులో అధ్యక్ష పదవిని అధిరోహించాలని ఆకాంక్షిస్తున్న వారిలో ఇవాంకతో పాటు ఆమె సోదరుడు డొనాల్డ్ జానియర్ కూడా ఉన్నట్లుగా అమెరికా మీడియా కోడై కూస్తోంది. ట్రంప్ ఆరోపణలను డొనాల్డ్ జూనియర్ సమర్థిస్తూ భవిష్యత్తులో ఆయన మద్ధతు పొందేందుకు ప్రయత్నిస్తుండగా.. ఇవాంక మాత్రం ఓటమిని ఒప్పుకునేలా మెల్లిగా ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ట్రంప్ కుటుంబం రెండు వర్గాలుగా విడిపోయింది. ఓటమిని అంగీకరించాలని సూచిస్తున్న వారిలో ఆయన భార్య మెలానియా ట్రంప్, అల్లుడు జేర్డ్ కుష్నర్‌తో పాటు కొందరు రిపబ్లిక్ పార్టీకి చెందిన నేతలు ఉన్నారు.
ఎన్నికల్లో ఓడినప్పటికీ మరో రెండు నెలలపాటు అంటే జనవరి 20 వరకు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంపే కొనసాగుతారు. ఒక వేళ బైడెన్‌ను ఇబ్బందులకు గురిచేయాలని ట్రంప్ భావిస్తే.. ఈ రెండు నెలల సమయాన్ని ఆయన వాడుకోవచ్చు. అయితే, ఇలా చేస్తే భవిష్యత్తులో ట్రంప్ సవాళ్లు ఎదుర్కోవాల్సిందే. ట్రంప్, ఆయనకు సంబంధించిన సంస్థలపై పన్ను ఎగవేత ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా.. ట్రంప్ తనను బలవంతంగా కిస్ చేశారని ఓ రియాలిటీ షో కంటెస్టెంట్ ఆయనపై కోర్టులో పిటీషన్ వేశారు. వీటితో పాటు ట్రంప్‌పై పరువు నష్టం కేసు కూడా ఉంది. అధికారం వల్ల ట్రంప్ ఇంతకాలం క్రిమినల్ కేసుల్లో విచారణను ఎదుర్కోలేదు. జనవరి 20 తర్వాత ట్రంప్ చేతిలో అధికారం ఉండదు. దీంతో క్రిమినేల్ కేసుల్లో విచారణను ఎదుర్కోవాల్సి వస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి