ఆడపిల్ల పై అత్యాచారం చేస్తే.. ప్రాణాలు తీసేస్తే శిక్ష పడుతుంది అన్న భయం కూడా ఎవరి లో కనిపించడం లేదు. రోజు రోజుకు తెర మీదకి వస్తున్న ఘటనలు అందరినీ ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేస్తున్నాయి. మహిళలు అందరూ కామాంధుల బారిన పడకుండా ఉండేందుకు ఎన్నో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా రోజు రోజుకు తెర మీదకి వస్తున్న ఘటనలు మాత్రం మహిళలకు రక్షణ లేదు అనే విషయాన్ని ప్రతి క్షణం గుర్తు చేస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది... ఓ యువతిపై దారుణంగా అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్య చేశారు.
అక్కడితో ఆగకుండా మానవ మృగాలు గా మారిపోయిన సదరు మనుషులు ఏకంగా సదరు యువతి గుండెను శరీరం నుంచి వేరు చేసి తిన్న దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. ఈ అత్యంత పాశవిక ఘటన ఉత్తర ప్రదేశ్లోని బద్రాస్ లో వెలుగులోకి వచ్చింది. బీరమ్, అంకుల్ అనే ఇద్దరు వ్యక్తులు ఏకంగా ఏళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టి హత్య చేశారు. అనంతరం ఈ అత్యాచారానికి కుట్ర చేసినా పరశురామ్ సునయన అనే దంపతులకు హత్యకు గురైన బాలిక గుండె కోసి ఇవ్వగా వాళ్ళు ఆ గుండెను తిన్నారు అని నిందితులు దర్యాప్తులో చెప్పడంతో పోలీసులు సైతం ఒక్కసారిగా షాకయ్యారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి