ఇలా ఎటు చూసినా అయోమయ పరిస్థితి. ఎంతో శ్రమించి సంపాదించిన ధనాన్ని ఎక్కడ దాచుకుంటే మంచిది...??? ఎంత మొత్తంలో దాచుకుంటే మంచిది....??? అన్న ప్రశ్న సామాన్యులకు అర్థం కాకుండా ఉంది. అయితే ఈ మధ్యే లక్ష్మీ విలాస్ బ్యాంకు తీవ్ర నష్టాల్లో మునిగిపోయింది. దీంతో డిపాజిటర్లకు డబ్బు విత్ డ్రాపై ఆర్బీఐ పరిమితులు విధించింది. గరిష్టంగా రూ.25000 వరకు మాత్రమే తీసుకోవచ్చని సూచించడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒకవేళ ఏదైనా బ్యాంకు నష్టానికి గురైతే ఆ బ్యాంకు నుండి ఒక ఖాతాదారుడు రూ.5 లక్షలకు మించి డ్రా చేయడానికి లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షలకు వరకు మాత్రమే బీమా సౌకర్యాన్ని కల్పిస్తుంది. కాబట్టి ఈ పరిమితికి మించి ధనాన్ని బ్యాంకులో దాచేందుకు ఖాతాదారులు వెనుకంజ వేస్తున్నారు.
ఇప్పుడు ఇదే తరహాలో తాజాగా లక్ష్మీవిలాస్ అనే బ్యాంకులో రూ.5 లక్షలకు పైగా డిపాజిట్ చేసిన వారు తమ డబ్బును వెనక్కి తీసుకునేందుకు వివిధ మార్గాలలో ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు చూసిన ప్రజలు డబ్బులను బ్యాంకులో దాచడానికి ఆలోచిస్తున్నారు. కాగా బ్యాంక్ నిపుణులు డబ్బును ప్రైవేటు బ్యాంకుల్లో కంటే ప్రభుత్వ బ్యాంకుల్లో దాచుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.... ఎందుకంటే ప్రభుత్వ బ్యాంక్ అయితే ఒకవేళ బ్యాంకు నష్టపోయిన డిపాజిటర్లకు వాళ్లు దాచుకున్న మొత్తం .5 లక్షలకు మించిన ఆ ధనాన్ని చెల్లించడానికి ప్రభుత్వం హామీ గా నిలబడి చెల్లిస్తుంది... కానీ ప్రైవేట్ బ్యాంకు కు ఈ పరిస్థితి వస్తే పరిమితులు విధిస్తారు. .... ఇక మరో సలహా ఓకే బ్యాంకులో ఎక్కువమొత్తాన్ని ఉంచకుండా రెండు మూడు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ఉత్తమమని సూచిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి