జగన్ రాష్ట్రంలో ఎలాంటి పాలన అందిస్తున్నారో అందరు చూస్తూనే ఉన్నారు. .ప్రతిపక్షాలు కొన్ని కొన్ని సార్లు ఇబ్బంది పెట్టాలని చూసినా దాన్ని జగన్ అధిగమించి సుపరిపాలన కొనసాగిస్తున్నారు.. సరిగ్గా రెండేళ్ల క్రితం జగన్ పరిస్థితి ఎలా అయిపోతుందో అన్నవారి ముక్కున వేలేసుకునేలా జగన్ ఎదిగారు..ఎన్ని కష్టాలు వచ్చిన ప్రజలకిచ్చిన మాట తప్పలేదు.. గెలవకముందు ఏదైతే హామీలు ఇచ్చారో అవి చేస్తూ బెస్ట్ సీఎం అనిపించుకుంటున్నారు.. ఇక ముఖ్యమంత్రి అయ్యాక అయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఆయన్ని ఇంత ప్రజాదరణ పొందేలా చేశాయని చెప్పొచ్చు..

పథకాలు అమలు చేయడం ఒక ఎత్తు అయితే ఆ పథకాలను సరిగ్గా ప్రజలకు అందుతున్నాయా లేదా అని జగన్ స్వయంగా చూసుకోవడం మరొక ఎత్తు అయ్యింది.. అందుకే జగన్ గెలుపు రాష్ట్రంలో ఒక విప్లమని చెప్పాలి.. ఎందుకంటే గెలుస్తుందా గెలవాడా అన్న స్థాయి నుంచి బంపర్ మెజారిటీ తో గెలిచే స్థాయికి వచ్చిన వైసీపీ పార్టీ గెలుపు నిజంగా ఓ విప్లవమని చెప్పాలి..అప్పటికే టీడీపీ బకాసురులు ప్రజలనుంచి దోచుకుని ప్రజలను అణిచివేసే స్థాయికి వచ్చారు.. దాంతో ప్రజలు టీడీపీ ని అధికారంలోకి రానివ్వొద్దని డిసైడ్ అయ్యారు.. దాంతో ప్రత్యామ్నాయంగా కనిపించిన జగన్ ని గెలిపించి ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు..  

ఇకపోతే చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి లో భాగంగా జిల్లాల పెంపు ప్రక్రియను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.. అందుకు నిమ్మగడ్డ రమేష్ అడ్డంకి గా మారడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కొత్త జిల్లాల ఏర్పాటు కోసం జ‌గ‌న్ నియ‌మించిన క‌మిటీ సైతం అనేక క‌స‌ర‌త్తులు చేసి కొత్త జిల్లాల‌ను ఎలా ? ఏర్పాటు చేయాల‌నే అంశాన్ని ఓ కొలిక్కి తెచ్చింది. కొత్త జిల్లాల ప్రక‌ట‌న త‌ర్వాత.. అది కూడా నిమ్మగ‌డ్డ ప‌ద‌వీ కాలం ముగిశాక ఎన్నిక‌ల‌కు వెళితే త‌న పంతం నెగ్గడంతో పాటు త‌న పార్టీ నేత‌ల‌కు భారీ ఎత్తున ప‌ద‌వులు వ‌స్తాయ‌ని జ‌గ‌న్ ముందు నుంచి ప్లాన్‌తో ఉన్నారు. అయితే ఇప్పుడు త‌ప్పనిస‌రిగా ఫిబ్రవ‌రిలోనే స్థానిక సంస్థల ఎన్నిక‌లు జ‌రిగే ఛాన్సులు ఉండ‌డం జ‌గ‌న్‌ను ఇర‌కాటంలో ప‌డేసిన‌ట్లయ్యింది. ఫిబ్రవ‌రిలో స్థానిక సంస్థల ఎన్నిక‌లు అంటే ఈ లోగా జిల్లాలను ప్రక‌టించినా.. విభ‌జ‌న పూర్తి కాదు.. మ‌ళ్లీ కొత్త జిల్లాల రిజ‌ర్వేష‌న్లు కూడా ఓ కొలిక్కి రావు. ఈ లెక్కన చూస్తే స్థానిక సంస్థల ఎన్నిక‌లు పూర్తయ్యాకే కొత్త జిల్లాలు ఏర్పాటు కావొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: