ఈ క్రమం లోనే టీఆర్ఎస్ వైఫల్యాల ను ప్రజల్లోకి తీసుకెళ్లడం తో పాటు... ఇక మార్పు కోసం బిజెపికి ఓటు వేయాలని బీజేపీతోనే మార్పు సాధ్యం అంటూ సూచిస్తుంది. ఇక ప్రచారం కోసం ఢిల్లీ పెద్దలను కూడా రంగంలోకి దింపి ప్రచారం చేయించడం మరింత ఆసక్తికరం గా మారిపోయింది. ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా... యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాంటి బిజెపి ప్రముఖులందరూ జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ వచ్చి ప్రచారం నిర్వహించారు. అదే ఈ సమయంలో తెలంగాణ బీజేపీ నేతలు కూడా టిఆర్ఎస్ పార్టీ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తో పెట్టుకుంటే టీఆర్ఎస్ నేతలు అందరూ కాలి పోతారు అంటూ వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన ను రాజకీయం చేయొద్దు అంటూ కోరిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అంత కావాలంటే టిఆర్ఎస్ నేతలు పాకిస్తాన్ ప్రధాని, చైనా ప్రధాన మంత్రులను కూడా పిలిపించుకోవాలని అంటూ సూచించారు. చైనా పాకిస్థాన్ ప్రధాన లను సరిహద్దుల్లోనే కొట్టి చంపుతాము అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి