ప్రియురాలితో ఏకాంతంగా ఉన్న సమయంలో తీసిన ప్రైవేట్ ఫోటోలు అన్నింటినీ కూడా పిల్లలకు పంపించడం మొదలు పెట్టి మరింత వేధింపులకు గురి చేశాడు. దీంతో చేసేదేమీ లేక మహిళ పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్ లో చోటుచేసుకుంది. అంబవడి లో నివసిస్తున్న మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పదిహేనేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయిన సదరు మహిళ క్యాటరింగ్ ఏజెన్సీ లో పనిచేస్తూ కుటుంబ పోషణ చూసుకుంటుంది అయితే ఏడాదిన్నర క్రితం ఆమె తో పాటు పనిచేసే మితేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది.
కొన్నాళ్లపాటు వీరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగింది అయితే తర్వాత వివాహేతర సంబంధం పిల్లలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని భావించిన మహిళ మితేష్ ను దూరం పెరుగుతూ వచ్చింది. కానీ ప్రియురాలు ఇలా దూరం పెట్టడం అతనికి నచ్చలేదు. ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫోటో సోషల్ మీడియాలో పెడతాను అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇక ఓ రోజు ఏకంగా మహిళతో ఏకాంతంగా దిగిన ఫోటోలను ఆమె పిల్లలకే పంపించడంతో అందరూ షాక్ అయ్యారు... ఇక చేసేదేమీ లేక మహిళ పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కు తోసారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి