గత ఎన్నికల్లో వైసీపీ చేతిలో ఓటమితో టీడీపీ ఎంతటి పరాభవం పొందిందో అందరికి తెలిసిందే.. నాలుగు సార్లు అధికారంలోకి వచ్చిన ఓ పార్టీ ఇంత దారుణంగా ఓడిపోవడం ఇదే తొలిసారి.. అయితే ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత లేకపోతే మాత్రం ఈ రేంజ్ లో ప్రజలు ఓడించారు.. కేవలం 23 సీట్లతో సరిపెట్టుకుని వైసీపీ పార్టీ చేతిలో దారుణంగా ఓటమి చెందింది టీడీపీ..తమ విజయం పక్కా అనుకున్న ప్రతి చోటా వైసీపీ నెగ్గి టీడీపీ ని ఖంగు తినిపించేంలా చేసింది. అయితే ఈ విజయాన్ని జగన్ తలకి ఎక్కించుకుకోకుండా ప్రజలకు నాణ్యమైన సేవ అందిస్తున్నారు.

ఇక ఓటమి తర్వాత పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది అని చెప్పొచ్చు.. అధినేత చంద్రబాబు తప్పా అధికార పార్టీ ని విమర్శించే సాహసం ఎవరుచేయలేకపోయారు.. అప్పుడే అవినీతి పరులను ఏరిపారేస్తున్న జగన్ కి ఎక్కడ ఎదురెళ్తే తమకు అదే గతి పడుతుందేమోనన్న భయం టీడీపీ నేతల్లో నెలకొనగా జగన్ ని ఎవరు ఎదురించలేని పరిస్థితి ఇప్పుడు ఏపీ లో అయితే నెలకొంది..

అయితే జగన్ ను ముందుంచి మెచ్చుకున్నా కొంతమంది తన తండ్రి స్నేహితులు వెనుకునుండి మాత్రం నొచ్చుకుంటున్నారట..జగన్ కి వారితో ఎందుకో సరైన అవగాహన లేదో లేక కావాలని దూరం పెట్టారో తెలియదు కానీ జగన్ ని గట్టిగానే తగులుకుంటున్నారు నిన్నటి దాకా పీసీసీ చీఫ్ గా పనిచసిన రఘువీరారెడ్డి జగన్ మీదనే విమర్శలు ఎక్కువగా  చేస్తున్నారు. అలాగే దేశంలో అత్యంత బలహీనమైన సీఎం ఎవరైనా ఉంటే అది జగన్ మాత్రమేనని తూకమేసి మరీ చెప్పేశారు పీసీసీ చీఫ్ సాకె శైలజానాధ్. అయితే వీరందరూ వైఎస్సార్ తో పనిచేసిన ఆయనను దేవుడి లా కొలిచినవారే.. పార్టీ లో వారికి ప్రాముఖ్యత ఇవ్వకపోవడం వారి ఆగ్రహానికి కారణం.. ఈనేపథ్యంలో వారినుంచి వచ్చే ప్రమాదాన్ని జగన్ ఎలా తప్పుంచుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: