దేశంలోనే ఎన్నడూ ఏ మహానేత చేయలేని విధంగా జగన్ వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకం' ద్వారా భూముల సమగ్ర రీసర్వే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం శ్రీకారం చుడుతోంది. పల్లె సీమల్లో శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసేలా వందేళ్ల చరిత్రలో దేశంలోనే అతి పెద్ద రీసర్వేను తలపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు నుంచి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.పైలట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే రీసర్వే పూర్తయిన తక్కెళ్లపాడులో స్థిరాస్తి హక్కు పత్రాలు, భూ హక్కు పత్రాలను సంబంధిత యజమానులకు అందించనున్నారు.
తక్కెళ్ల పాడులో సరిహద్దు రాయిని ప్రారంభించి 13 జిల్లాలకు చెందిన సర్వే బృందాలకు పచ్చజెండా ఊపడం ద్వారా రీసర్వేకి గ్రీన్‌సిగ్నల్ ఇస్తారు. మంగళవారం ప్రతి జిల్లాలో ఒక గ్రామంలో రీసర్వే పనులు ప్రారంభమవుతాయి. తదుపరి వారం రోజుల్లో ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ఒక గ్రామంలోనూ, ఆ తర్వాత నాలుగైదు రోజుల్లో ప్రతి మండలంలో ఒకటి చొప్పున 670 గ్రామాల్లో రీసర్వే, మొదటి విడుతలో 5,122 గ్రామాల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, రెండో విడతలో 6000, ఆ తర్వాత విదుతలో మిగిలిన గ్రామాలలో ఈ సర్వే ను పూర్తి చేయనున్నారు. ఆగస్టు 2023 నాటికి ఈ ప్రక్రియను సజావుగా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం జగ్గయ్య పేటలో జగరనున్న ఈ కార్యక్రమానికి వైకాపా నేతలు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన బోతున్నారు.. మహా నేత పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.. ఇలాంటి మరెన్నో పథకాలను అమలు చేస్తూ, ప్రజల్లో సంతోషాన్ని నింపుతూ, ఎప్పటికీ ఆంధ్ర రాష్ట్రానికి మకుటం లేని సీఎం గా వర్ధిల్లాలని ఆంధ్రుల తో పాటుగా మా హెరాల్డ్ ఛానెల్ తరపు నుంచి కోరుకుంటున్నాము.. హ్యాపీ బర్త్ డే టూ యు జగన్ మోహన్ రెడ్డి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి