మృత్యువు ఎప్పుడు ఎటునుంచి దూసుకువచ్చి కబళిస్తు చివరికి కుటుంబంలో విషాదం నింపుతుందో అన్నది ఊహకందని విధంగా ఉంటుంది అనే విషయం తెలిసిందే. అంతా సంతోషంగా గడిచిపోతుంది అనుకుంటున్న తరుణంలో విధి చిన్నచూపు చూడడంతో మృత్యువు కబలిస్తుంది. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన జరిగింది. మరో రెండు రోజుల్లో పెళ్లి చేసుకుని యువకుడు వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు.  ఈ క్రమంలోనే ఇక అటు ఇరు కుటుంబాలు కూడా అన్ని ఏర్పాట్లు చేశాయి. ఇక మరో రెండు రోజుల్లో పెళ్ళి తంతు పూర్తి అవుతుంది అనుకుంటున్న తరుణంలో అంతలో ఊహించని ఘటన రెండు కుటుంబాల్లో  తీరని విషాదాన్ని నింపింది,


 మరో రెండు రోజుల్లో పెళ్లి ఉంది అని అనుకుంటున్న సమయంలో వరుడు ఊహించని రీతిలో మృత్యువాత పడిన ఘటన స్థానికంగా విషాద ఛాయలు అలుముకునెల చేసింది. కాబోయే భార్య ఇంట్లో శుభకార్యానికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో మరణించాడు యువకుడు. ఈ విషాదకర ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగులోకి వచ్చింది.  చండ్రుగొండ మండలం తిప్పన పల్లి కి చెందిన 30 ఏళ్ల శ్రీను  ప్రైవేట్ టీచర్ గా పని చేసేవాడు.  కాగా ఈ నెల 23వ తేదీన టేకులపల్లి మండలానికి చెందిన యువతితో పెళ్లి జరగాల్సి ఉంది.


 మరో రెండు రోజుల్లో పెళ్లి ఉంది అనుకుంటున్న తరుణంలో ఇరు కుటుంబాలు కూడా పెళ్లి హడావిడిలో ఉన్నాయి ఈ క్రమంలోనే కాబోయే అత్తగారి ఇంట్లో శుభకార్యం జరిగగా  శుభకార్యానికి హాజరయ్యారు శ్రీను. ఇక భోజనం చేసి రాత్రి సమయంలో తిరుగు ప్రయాణం అయ్యాడు ఇంటికి వచ్చేటప్పుడు దారి మధ్యలో ఆగి  ఓ బ్యాగ్ కొనుగోలు చేసి పెద్దగా ఉన్న బ్యాగ్ ని ముందు భాగంలో పెట్టుకొని బయల్దేరాడు ఈ క్రమంలోనే మూలమలుపు వద్దకు రాగానే ప్రమాదానికి గురై చనిపోయాడు.  బ్యాగ్  వల్ల అతని బైక్ హ్యాండిల్ సరిగ్గా తిరగకపోవడం తోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: