అయితే అప్రమత్తమైన పోలీసులు లోన్ యాప్ పేరుతో చైనా ఆడుతున్న నాటకాలకు ఫుల్ స్టాప్ పెట్టారు పోలీసులు . దీంతో చైనా కు భారీ షాక్ తగిలింది. ఇలాంటి క్రమంలోనే మరో ప్లాన్ తో భారత్ లోని జనాల్ని బురిడీ కొట్టించేందుకు చైనా సిద్ధమైంది అన్నది తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎన్నో పార్ట్ టైమ్ జాబ్స్ ప్రకటనలు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఆకర్షణీయమైన వేతనం ఉంటుందని కేవలం నిమిషాల వ్యవధిలోనే ఎక్కువ ఆదాయం పొందేందుకు అవకాశం ఉంటుంది అంటూ ఎన్నో పార్ట్ టైన్ జాబ్ ప్రకటనలు జనాలను ఆకర్షిస్తున్నాయి. ఇక ఇప్పుడు చైనా కూడా ఇదే తరహా ప్లాన్ అమలు చేస్తున్నది.
కరోనా కాలంలో ఎంతో మంది నిరుద్యోగులుగా మారిన నేపథ్యంలో యువతకు ఉద్యోగాల పేరుతో ఎర వేసేందుకు చైనా హ్యాకర్లు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే సైబర్ దాడులు చేస్తున్నారు. పార్ట్ టైమ్ జాబ్ ల పేరుతో ఆయా వాట్సాప్ ఖాతాలకు లింకు పంపి ఇక ఆ తర్వాత అది ఓపెన్ చేయగానే పలు వివరాలు తెలుసుకొని చివరికి సైబర్ దాడులకు పాల్పడుతున్నారు చైనా హ్యాకర్లు. కేవలం ముప్పై నిమిషాల వ్యవధిలో రెండు వందల నుంచి మూడు వేల రూపాయల వరకు సంపాదించవచ్చు అంటూ మాయమాటలతో మభ్యపెడుతున్నారు. ఇలా పార్ట్ టైమ్ జాబ్ పేరుతో వచ్చిన లింక్ లపై క్లిక్ చేయడం వల్ల కొంత సమాచారం చైనా హ్యాకర్లకు వెళ్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి