ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తర ప్రదేశ్ కి ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న సమయంలో విశ్వాసపాత్రుడు గా తనకు బాగా చేరువైన యూపీ అధికారి ఒకరు తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో రాజకీయంగా చర్చ మొదలైంది. త్వరలోనే ఈయనను కీలక పదవిలో నిలబెట్టేందుకు మోదీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులోనూ ఆ అధికారి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని మరీ బిజెపిలో చేరడంతో న్యూస్ వైరల్ గా మారింది.

ఇంతకీ ఆయన ఎవరు... ఏంటి అన్న విషయానికి వస్తే.....మోడీకి అత్యంత నమ్మకస్తుడైన అధికారిగా పేరున్న ఐఏఎస్ అధికారి అయిన ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌ శర్మ, తన పదవికి గుడ్ బై చెప్పి స్వయంగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అనంతరం బిజెపి పార్టీలో చేరి అందర్నీ ఆశ్చర్యపరిచారు. త్వరలోనే ఉత్తరప్రదేశ్‌ శాసన మండలికి పోటీ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. యూపీలోని 12 మండలి స్థానాల భర్తీకి ఈ నెల 28న జరుగనున్న ఎన్నికల్లో అరవింద్ కుమార్ శర్మ పోటీ చేయబోతున్నట్లు సమాచారం.

మోడీ ని నమ్ముకుని జాబ్ ని వదులుకున్న విశ్వామిత్రుడు అరవింద్ కు ఎన్నికల అనంతరం సీఎం యోగి సర్కార్ లో ఆయనకు కీలక పదవి లభిస్తుందని ప్రచారం జరుగుతున్నది. దాదాపు రెండు దశాబ్దాలుగా తన పనితీరు, ఫలితాల ఆధారిత విధానంతో ప్రధాని మోదీ నమ్మకాన్ని పొందిన... అరవింద్ శర్మకు మండలి ఎన్నిక అనంతరం తన శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుందని... పార్టీలో కీలక పదవి వరిస్తుందని బీజేపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. పార్టీని నమ్ముకుని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న అరవింద్ కుమార్ కు యోగి సర్కార్ కీలక పదవిని కట్టబెట్టనుందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరి ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ని నమ్ముకున్న మాజీ ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌ శర్మ కు కు ఎన్నికల అనంతరం ఏ పదవి దక్కుతుందో చూడాలి...!

మరింత సమాచారం తెలుసుకోండి: