నూతన సంవత్సరంలో ఓ కీలక నిర్ణయంతో ఉద్యోగులకు తీపి కబురు అందించింది కేంద్ర ప్రభుత్వం. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఆ సమయం రానే వచ్చింది... వారి కోరుకున్నట్లుగానే చేయబోతున్నాం అంటూ హామీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.. అందులోనూ అది త్వరలోనే అమలు కాబోతుంది అనడంతో ఉద్యోగాల ఆనందానికి అవధులు లేవు. ఉద్యోగులు కేంద్రం నుండి డి ఏ పెంపు కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇది జరగడానికి మరో ఆరు నెలల పాటు పడుతుందని అంచనా వేసే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పి ఆశ్చర్యపరిచింది కేంద్రం.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు బత్యం (Dearness Allowance - DA)ను  పెంచుతున్నట్లు తెలుస్తోంది. అందులోనూ ఉద్యోగులు అంచనా వేసినట్లుగా ఆరు నెలలు కాదట....  వారు ఆశించిన దాని కంటే త్వరగానే డి ఏ పెంపు ఉంటుందని  తెలిసింది. ఏడో వేతన చెల్లింపుల సంఘం ప్రతిపాదనలను లెక్కలోకి తీసుకొని కేంద్రం డీఏను హైప్ చేస్తున్నట్లు సమాచారం. కేంద్ర వర్గాల రిపోర్టుల ప్రకారం... జనవరి నుంచి డీఏ 4 శాతానికి పెంచపోతున్నట్లు వార్తలు అందాయి. వాస్తవానికి డి ఏ (Dearness Allowance - DA)ను గతేడాది పెంపు చేయాలి అనుకున్న కేంద్రం... కరోనా మహమ్మారి బీభత్సం  సృష్టిస్తుండంతో ఈ నిర్ణయానికి బ్రేక్ పడింది. కరోనా కష్టకాలంలో కేంద్రం ఖజానా ఖాళీ కావడంతో డి ఏ గురించి ఓ నిర్ణయానికి రాలేకపోయింది ప్రభుత్వం.

 అయితే ఇప్పుడు మళ్లీ ఆర్థిక వనరులు పుంజుకుంటున్న వేళ ఉద్యోగుల అభ్యర్థనను అర్థం చేసుకొని కోవిడ్ నేపథ్యంలో వారు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు దృష్టిలో ఉంచుకొని డి ఏ ను పెంచాలని కేంద్రం ఆలోచించినట్లు సమాచారం. నిజంగానే జనవరి నుంచి ఉద్యోగులకు డీఏను పెంచితే... అది 21 శాతానికి చేరుకోనుంది. దీని వల్ల 50 లక్షల మంది దాకా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో సేవల నుంచి తాత్కాలికంగా దూరమై... తిరిగి సేవలు కొనసాగిస్తున్నా ఉద్యోగులకు... వైకల్య పరిహారం (disability compensation) ఇచ్చేందుకు కేంద్రం ఒప్పుకొంది. ఈ విషయానికి సంబంధించి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ జనవరి 1న  ప్రకటన చేసిన విషయం తెలిసిందే.  ఇలా ఈ నూతన సంవత్సరంలో ఉద్యోగులకు శుభవార్త లు అందుతున్నాయి అన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: