హైదరాబాద్: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన దిగ్విజయ్ సింగ్ పై సీబీఐ విచారణకు మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దిగ్విజయ్ మధ్యప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్దంగా ఓ సంస్థకు భూముల్ని కట్టబెట్టారనీ కోర్టులో ఓ వ్యక్తి పిటీషన్ వేశారు. దీనిపై స్పందించిన మధ్యప్రదేశ్ కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఆరు నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి నివేదికను తమకు సమర్పించాలనీ కోర్టు సీబీఐకి ఆదేశాలను జారీ చేసింది. అయితే, దీనిపై స్పందించిన దిగ్విజయ్ తాను ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదనీ, తాను అన్నీ నిబంధనల ప్రకారమే చేశాననీ, ఎలాంటి విచారణనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు దిగ్విజయ్ అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: