సాధారణంగా నేటి రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఫ్రిజ్లో ఉంచిన ఎంతో చల్లటి నీళ్లు తాగడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు అనే విషయం తెలిసిందే. అయితే చల్లటి నీళ్లు తాగడం కంటే గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని ప్రస్తుతం వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా అయితే ఒకప్పుడు ఎవరు కూడా గోరువెచ్చని నీళ్ళు తాగడానికి అంతగా ఆసక్తి చూపేవారు కాదు కానీ ప్రస్తుతం కరోనా  వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు గోరువెచ్చని నీరు తాగడం ద్వారా వైరస్ ను అంతం చేసే అవకాశం ఉందని అధ్యయనాల్లో  వెల్లడి కావడంతో.. అందరూ కూడా గోరువెచ్చని నీళ్లు తాగడానికి ఒక అలవాటు చేసుకున్నారు.


 ప్రస్తుతం ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు గోరువెచ్చని నీళ్ళు తాగడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అనే విషయం తెలిసిందే. చల్లటి నీరు జోలికి అస్సలు వెళ్లడం లేదు.  ఇక ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే గోరువెచ్చని నీళ్ళు తాగడానికి ఆసక్తి చూపుతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల కేవలం కరోనా  వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి..  ఇంకా ఎన్నో రకాల ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉన్నాయి అని అంటున్నారు విశ్లేషకులు.



 అయితే గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల ముక్కు గొంతు లో ఉండే శ్లేష్మం  పూర్తిగా కరిగి పోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక శీతాకాలంలో శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడేవారు గోరువెచ్చని నీళ్లు తాగితే ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చునని సూచిస్తున్నారు నిపుణులు. అజీర్ణంతో ఇబ్బంది పడుతున్న వారు గోరువెచ్చని నీటిని తాగితే ఉపశమనం లభిస్తుందట. అంతేకాకుండా ప్రతి రోజూ గోరువెచ్చని నీరు తాగడం వల్ల మెటబాలిజం పెరిగి ఒంట్లో ఉన్న కొవ్వు కరిగిపోయి ఇక బరువు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: