మానవ జీవితం దేవుడి చేతిలో కీలుబొమ్మలాట  అని చెబుతూ ఉంటారు పెద్దలు... అయితే ఇదంతా ట్రాష్ అని కొట్టి పారేస్తూ ఉంటారు మరికొంతమంది... కానీ కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే మాత్రం నిజంగానే దేవుడి చేతిలో మనుషుల జీవితం కీలుబొమ్మలాట  అని అనిపిస్తూ ఉంటుంది. సాఫీగా సాగిపోతున్న జీవితంలో ఊహించని ఘటనలతో తీరని విషాదం నిండి పోతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. పిల్లలను ఇచ్చి  ఎంతో ఆనందపరచిన దేవుడే ఆ తర్వాత పిల్లలను దూరం చేసి తీరని కడుపుకోత మిగిల్చి  అరణ్యరోదన  ఇస్తూ ఉంటాడు. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది.



 పిల్లలు పుట్టారని ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోష పడి పోయారు. కానీ వారి సంతోషాన్ని విధి చిన్నచూపు చూసింది.  మొదటిసారి పురిట్లోనే బిడ్డను  కోల్పోయారు ఆ తల్లిదండ్రులు.  ఇక ఆ తర్వాత కొడుకు పుట్టగా ఎంతో అల్లారుముద్దుగా ఏ కష్టం రాకుండా చూసుకొంటున్నారు.  ఇక 18 నెలల కొడుకే  ప్రాణంగా బతుకుతున్నారు కానీ.. మరోసారి వారి ఆనందాన్ని చూసి విధి వెక్కిరించింది..  18 నెలల కుమారుడు కూడా దూరం కావడంతో ఇక తల్లిదండ్రులు అంతుచిక్కని వేదనతో కుమిలిపోతున్నారు. ఈ విషాదకర ఘటన కర్నూలు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.



 కర్నూలు జిల్లా పాములపాడు మండలం గ్రామానికి చెందిన మహమ్మద్ రఫీ అనే వ్యక్తికి 18 నెలల వయసున్న అఖిల్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే ఇటీవల దురదృష్టవశాత్తు ఆడుకుంటూ నీటి తొట్టిలో  పడి మృతి చెందాడు.  అయితే మహమ్మద్ రఫీ దంపతులకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగగా  మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టింది పురిటిలోనే మృతి చెందింది ఇక రెండో కాన్పులో మగబిడ్డ పుట్టాడు దీంతో ఇక మగబిడ్డను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు తల్లిదండ్రులు.  ఇంటి దగ్గర ఉన్న నీటితో నిండుగా ఉన్న తొట్టిలో  చిన్నారి పడిపోయాడు. ఎంతసేపటికీ పిల్లవాడు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికారు  తల్లిదండ్రులు. ఇక నీటి తొట్టిలో  విగతజీవిగా పడి ఉన్న కొడుకుని చూసి అరణ్యరోదనగా విలపించారు  తల్లిదండ్రులు.

మరింత సమాచారం తెలుసుకోండి: