అయితే ఈ ఎన్నికల ఫలితాలను టీడీపీకి మరణ శాసనంగా అభివర్ణిస్తున్న కొందరు మంత్రులు.. అంతేకాదు.. ఏకంగా చంద్రబాబు టార్గెట్ చేస్తూ మాటల బాణాలు వదులుతున్నారు. ఈ ఫలితాలతో చంద్రబాబు అమరావతి ఉద్యమానికి బలం లేదని తేలిపోయిందంటున్నారు. కొందరు మరో అడుగు ముందుకేసి చంద్రబాబు ఏకంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే అడుగు పెట్టొద్దంటున్నారు. ఇక మంత్రి కొడాలి నాని సంగతి తెలిసిందే కదా. ఆయన మరింతగా చంద్రబాబుపై రెచ్చిపోయారు.
కొడాలి నాని ఏమంటున్నారంటే.." రాష్ట్ర ప్రజలు చంద్రబాబు ను తరిమివేశారు.. ఇకపై కృష్ణా గుంటూరు జిల్లాలో చంద్రబాబు అడుగు పెట్టకూడదు.. అమరావతిలో ఉన్న అమాయక మహిళలను రోడ్లపైకి తీసుకు వచ్చి మహిళాదినోత్సవం రోజున రాజకీయ లబ్ది చేకూర్చేచేందుకు ప్రయత్నించారు.. అమరావతిలో ఉన్న నిజమైన రైతులు ఇప్పటికైనా ఆలోచించాలి.. పరిపాలన రాజధానిగా అమరావతిని సీఎం జగన్ కొనసాగిస్తారు.. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ ను కొనసాగిస్తారు..న్యాయ రాజధానిగా కర్నూలును కొనసాగిస్తారు.. అన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో నలబై శాతం గెలిచామంటోన్న చంద్రబాబు ఎందుకు మీడియా ముందుకు రాలేదని మంత్రి కొడాలి నాని నిలదీశారు. జగన్ ను ఫేక్ ముఖ్యమంత్రి అని చంద్రబాబు అంటున్నారు.. ఎవరు ఫేక్ ముఖ్యమంత్రో ఫలితాలు రుజువు చేశాయి.. కుల మత ప్రాంతాల తేడాలు సీఎం జగన్ కు లేవు.. పేద ప్రజలకు లక్ష కోట్లు రూపాయల సంక్షేమ పథకాలు అందిస్తున్నారు.. ఎన్నికల్లో గొప్పతీర్పు ప్రజలు ఇచ్చారు.. ఓటు వేసినందుకు ప్రజలందరికీ పాదాభివందనం చేస్తున్నానన్నారు మంత్రి కొడాలి నాని.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి