బోండా ఉమ.. విజయవాడుకు చెందన ఈ టీడీపీ ఎమ్మెల్యే తరచూ వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. ఆ మధ్య ఈయన సుపుత్రుడు.. బైక్ రేసింగులకు పాల్పడి.. ఒక యువకుడి మృతి కారణమయ్యారన్న ఆరోపణలు వచ్చాయి. ఆయన కుమారుడిపై కేసు కూడా నమోదైంది. కాకపోతే పవర్ ఉపయోగించి తక్కువ డ్యామేజ్ తో బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలూ వచ్చాయి. 

ఇక మొన్నటికి మొన్న.. అసెంబ్లీలో పాతేస్తా  అంటూ కొడాలి నానిపై రెచ్చిపోయి డైలాగులు పేల్చి పెద్ద భూకంపమే సృష్టించారు. పార్టీ తరపున కానీ.. స్పీకర్ తరపున కానీ బోండా ఉమపై చర్య తీసుకోకపోయినా.. అలాంటి పిచ్చిపచ్చికామెంట్లు చేయొద్దని బాబు నుంచి వార్నింగులు పడ్డాయని టీడీపీ నేతలే చెబుతున్నారు. 

ఇక మంగళవారం ఆయన మరోసారి అసెంబ్లీలో బోర్లా పడ్డారు. విద్యుత్ చార్జీలపై చర్చలో జగన్ సమాధానం చెప్పిన తర్వాత ఆయన మాట్లాడారు. జగన్ కేవలం 20 నిమిషాలకు మించి మాట్లాడలేకపోయారని ఎద్దేవా చేశారు. జగన్ దగ్గర విషయం లేదనే సంగతి ఎస్టాబ్లిష్ చేసేందుకు ప్రయత్నించారు. 

వాస్తవం ఏంటంటే.. చంద్రబాబు, జగన్ ఎంతెంత మాట్లాడాలనే దానిపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మధ్యవర్తిత్వం చేసి సెట్ చేశారు. చంద్రబాబు 40నిమిషాలు, జగన్ 20 నిమిషాలు మాట్లాడేలా.. ఇరు పార్టీలను ఒప్పించారు. ఆ సంగతి తెలియని ఉమ రెచ్చిపోయారు. బోండా ఉమ కామెంట్స్ ను ఖండిస్తూ.. తర్వాత విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. మధ్యవర్తిత్వం గుట్టు విప్పారు. దాంతో బోండా ఉమ ఫేస్ బ్లాంక్ అయ్యింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: