రాజకీయాల్లో చంద్రబాబు వ్యూహాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఆయన వ్యూహాలతో ప్రత్యర్ధులని చిత్తు అయ్యేలా చేస్తారు. అయితే ఆ వ్యూహాలు ఒక్కప్పుడు బాగానే పని చేశాయి. కానీ అవి ఇప్పుడు వర్కౌట్ కావడం లేదు. ముఖ్యంగా జగన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక. పరిస్తితి మారిపోయింది.


బాబు అవే ఓల్డ్ ఐడియాలతో ముందుకెళుతుంటే, ప్రత్యర్ధిగా ఉన్న జగన్‌కు పెద్ద ఇబ్బంది ఏమి రావడం లేదు. ఏదో 2014 ఎన్నికల్లో బీజేపీ-జనసేనల అండతో జగన్‌కు చెక్ పెట్టగలిగిన చంద్రబాబు, 2019 ఎన్నికల్లో జగన్ ముందు తేలిపోయారు. జగన్ వేసే ప్రతి వ్యూహంలోనూ బాబు చిక్కి ఉక్కిరిబిక్కిరి అయ్యారనే చెప్పొచ్చు.


అయితే ఇప్పటికీ చంద్రబాబు అవే పాత ఐడియాలతో ముందుకెళుతున్నారు. అందుకే ఇంకా జగన్‌కు చెక్ పెట్టలేకపోతున్నారు. ఇప్పటికే జగన్ ఏపీలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిపోయారు. ఇక అలాంటి నాయకుడుకు చెక్ పెట్టాలంటే అదిరిపోయే వ్యూహాలు వేయాలి. కానీ బాబు అలాంటి పని ఏం చేయడం లేదు.


ఇప్పటికే ఏపీలో జగన్ హవా కొనసాగుతుంది. ఇటీవల జరిగిన పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని విజయాలు సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా జగన్ వేవ్ బలంగా కనిపిస్తోంది. అయితే జగన్ వేవ్‌ని టీడీపీ తట్టుకోలేకపోతుంది.


అందుకే చంద్రబాబు ఎలాంటి స్ట్రాటజీలతో ముందుకెళ్లాలో తెలియక, ఎన్నికలని బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. అయితే బాబు పైకి చెప్పినా, లోపల మాత్రం సీన్ వేరుగా ఉంది. చాలాచోట్ల టీడీపీ అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గతేడాదే నామినేషన్స్ వేసి ఉండటంతో  తమ్ముళ్ళు పరిషత్ ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే బాబు కూడా ఇంటర్నల్‌గా పోటీలో ఉండమనే ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.


అంటే ఒకవేళ టీడీపీ అభ్యర్ధులు ఘోరంగా ఓడిపోతే పోటీలో లేమని చెప్పుకుంటారు. అలాగే మంచిగా గెలిస్తే పోటీలో వద్దనుకున్న తమని జనం గెలిపించారని మాట్లాడుతారు. మొత్తానికైతే బాబు ఓ స్ట్రాటజీ ప్రకారం ముందుకు వెళుతున్నారు. మరి ఈ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.     


మరింత సమాచారం తెలుసుకోండి: