నేటి సమాజంలో మానవత్వం కనుమరుగైపోతుంది. నేటి సమాజంలో ఉరుకుల పరుగుల జీవితంలో ఓ మనిషి సాటి మనిషిని పట్టించుకునేంత సమయం కూడా లేకుండా పోయింది. ఇక ప్రపంచం స్వార్థం కల్లాకపటం ఇవేవీ వారికి తెలీదు. అందుకే చిన్నారుల్లో దయా హృదయం ఎక్కువగా కనిపిస్తుంది. వారి ఆట పాటల్లో.. నడతలో ఒక్కోసారి వారు చేసే చిన్ని చిన్ని పనుల్లో ఎంతో ముచ్చట ఉంటుంది.

కొన్నిసార్లు చిన్నారులు చేసే పనులు ఒక్కోసారి పెద్దల మనసుల్ని కదిలించేస్తాయి. వారు చేసే చిన్న పని మనకి ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక చిన్నారి చేసిన పని సోషల్ మీడియాలో అందరి దృష్టినీ ఆకర్షించింది. చిన్న బాలిక చేసిన ఆ పనితో దయ అనే పదానికి సారైన అర్ధం కనిపించింది అని అంతా కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ట్విట్టర్ లో ట్రెండీగా మారిన ఆ వీడియోలో..



ఇక వర్షం పడుతోంది రోడ్డుమీద ఒక కుక్క తడిచిపోతోంది. అక్కడే గొడుగు వేసుకుని ఒక చిన్న పిల్ల నిలుచుని ఉంది. తదిచిపోతున్న కుక్కను చూసింది. తన గొడుగు తీసుకెళ్ళి ఆ కుక్కపై వర్షం పడకుండా అడ్డు పెట్టింది. దానిని జాగ్రత్తగా రోడ్డు దాటించి తీసుకువెళ్ళింది. అలాగే, ఆ కుక్కను వదిలేయడానికి ఆ చిన్నారి ఒప్పుకోలేదు. ఎంతో దయామయంగా కనిపించిన ఈ చిన్నారి చేసిన పని ఇప్పుడు అందరి మనసుల్నీ తడి చేస్తోంది.

ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత నందా ఈ రోజు ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆయన ఈ వీడియోను షేర్ చేసిన వెంటనే వందలాది మంది దీనిని రెట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చేస్తూ సుశాంత నందా “దయ మరొకరి కోసం చిన్నచిన్న పనులు చేయిస్తుంది. ఇదే పనీ దయతో మీరు చేయగలరు” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఈ వీడియోను చూసిన వారంతా ఆ చిన్నారిపై ప్రసంశల జల్లు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: