కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో
కేంద్ర ప్రభుత్వం మళ్లీ లాక్ డౌన్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రోజు రోజుకు కరోనా ప్రభావం పెరుగుతుంది. లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి.. ఇకపోతే వేలల్లో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. మహమ్మారి దాటిని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు
సత్వర చర్యలు చేపట్టారు.. అంతేకాదు కరోనా వచ్చిన వారిని ప్రత్యేక వార్డులలో ఉంచి చికత్స ను అందిస్తున్నారు.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనా సోకిన వాళ్ళు
హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నారు. అలాంటి వారికి బయట నుంచి వారికి కావలసినవి అందిస్తున్నారు..
మహారాష్ట్ర,
కర్ణాటక,
గుజరాత్ రాష్ట్రాలలో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.. మరణాల రేటు కూడా పెరుగుతుంది.. కరోనా రోగులకు కావలసిన సదుపాయాలు లేక చాలా మంది రోగులు ఆసుపత్రి బయటనే ప్రాణాలను వదిలేస్తున్నారు.. దేశ వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి నుంచి బయట పడటానికి విదేశాల సాయాన్ని
భారత్ కోరింది.. వారి సాయంతో ఇప్పటికే కావలసిన మెటీరియల్
ఇండియా కు వచ్చింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం వేగవంతం చేయాలని అధికారులను కోరారు..
ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు ఒక వార్త షికారు చేస్తోంది.. మాస్క్, భోజనం ,ఫ్రీ అని అంటున్నారు.. వివరాల్లోకి వెళితే.. బర్కత్ పుర లో కొత్త ఆలోచన చేశారు.కరోనాతో ఇబ్బందులు పడుతూ ఇంటి వద్దనే హోంక్వారంటైన్‌లో ఉన్న రోగులకు ఉచితంగా మాస్క్‌లు, భోజనం పంపిణీ చేస్తున్నట్లు హ్యుమనిటీ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ కొండ శ్రీనివాస్‌రావు తెలిపారు. కరోనా బారిన పడిన వారికి తాము అండగా ఉన్నామనే ధైర్యం అందించడానికి మానవతా ధృక్పథంతో ఎన్ 95 మాస్క్‌లు, భోజనాన్ని ఇంటి వద్దకు తీసుకెళ్లి అందిస్తున్నట్లు తెలిపారు. పేద, అనాథ వృద్ధులకు కూడా ఉచితంగా భోజనం అందిస్తున్నామని, కరోనా బారిన పడిన వారు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 9949238492 ఫోన్ నెంబర్‌లో సంప్రదించాలని డాక్టర్ కొండ శ్రీనివాస్‌రావు విజ్ఞప్తి చేశారు.. ఇప్పటివరకు చాలా మంది కాల్ చేశారని చెప్పుకొచ్చారు..