ఎంతో కఠినతరమైన ఆంక్షల మధ్య కర్ఫ్యూ అమలయ్యే విధంగా ఏపీ సర్కార్ ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించింది.. అయితే.. ఇటీవలే గత 24 గంటల్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గడమే కాదు ఇక రికవరీ రేటు కూడా అంతకంతకూ పెరిగి పోవడం అందరిలో ధైర్యాన్ని నింపింది. ఇటీవలే ఏపీలో 60,124 శాంపిల్స్ టెస్ట్ చేయగా, 14,986 మందికి కరోనా కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి . కరోనా కారణంగా 84మంది ప్రాణాలు విడిచారు. అత్యధికంగా తూర్పుగోదావరిలో 2,352 కేసులు నమోదు కాగా, అత్యల్పంగా పశ్చిమగోదావరిలో 423 కేసులు వెలుగుచూశాయి.
ఇకపోతే రాష్ట్రంలో కొత్తగా 16,167మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్త కేసులు 14,986 ఉంటే.. కరుణ వైరస్ నుంచి కోరుకునే వారి సంఖ్య 16,167 గా ఉంది. కాగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,89,367 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇలా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నప్పటికీ రికవరీ రేటు కూడా అంతకు మించి అనే రేంజ్ లో పెరుగుతూ ఉండడం మాత్రం అందరిలో ధైర్యాన్ని నింపుతుంది. అయితే కేవలం ఆదివారం కాబట్టి కేసుల సంఖ్య తగ్గి రికవరీ రేటు పెరిగిందా లేదా ఇక రోజూ ఇదే పరిస్థితి కొనసాగుతుందా అన్నది మరో రెండు మూడు రోజులు గమనిస్తే అర్థమవుతుంది అని అంటున్నారు విశ్లేషకులు. ఏం జరుగుతుందో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి