దేశంలో కరోనా వైరస్ మహమ్మారి శరవేగంగా పాకిపోతుంది.  మొదటి రకం వైరస్ తో పోల్చి చూస్తే రెండవ రకం వైరస్ విజృంభిస్తు అందరిపై పంజా విసరడమే కాదు ఎంతో మంది ప్రాణాలను సైతం తీసేస్తుంది రోజురోజుకు వైరస్ కేసుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతు ఉండడమే కాదు ప్రజల్లో భయాందోళనలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి  అయితే ప్రస్తుతం కరోనా వైరస్ పై ప్రజలందరూ ఎంతలా అవగాహనతో ఉండి ధైర్యంతో వైరస్ నూ ఎదుర్కోవాలి అని అనుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా ప్రజల ధైర్యాన్ని చంపేస్తుంది ఈ మహమ్మారి వైరస్. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఎన్నో విషాదకర ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.



 ప్రస్తుతం కరోనా వైరస్ పేరెత్తితే చాలు జనాలు మొత్తం చిగురుటాకులా వణికిపోతున్నారు.  ఇక వైరస్ బారినపడి మరణిస్తున్నారు వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరిగి పోతూ ఉండటం మరింత బెంబేలెత్తిస్తుంది. అయితే ఇప్పటికి కూడా కొంతమందికి వైరస్ పట్ల సరైన అవగాహన ఉండడం లేదు. వైరస్ సోకింద అన్న భయంతో చివరికి ఏకంగా మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఇలా ఎంతోమంది కరోనా వైరస్ సోకింది అన్న కారణంతో ఇక ఏకంగా ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు వదిలారు ఇటీవల ఇలాంటి విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది.



 తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే కరోనా వైరస్ సోకింది అన్న భయంతో చివరికి మనస్తాపానికి గురైన ఓ రైతు తో పాటు యువకుడు సైతం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పడమటి గూడెం లో లింగయ్య అనే 40 ఏళ్ల వ్యక్తి ఇటీవలే  వైరస్ బారిన పడ్డాడు. ఇక వైరస్ సోకటంతో తీవ్ర మనస్థాపానికి గురైన లింగయ్య ఇటీవలే తన పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరోవైపు వరంగల్ రూరల్ లోని నర్సంపేట లో ఓ యువకుడు కరోనా వైరస్ సోకింది అన్న భయంతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: