ఓవైపు తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్  కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న సమయం లో ప్రజలు అందరూ సరైన వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో జూనియర్ డాక్టర్ల సమ్మె సైరన్ మోగించడం సంచలనంగా మారిపోయింది. దీర్ఘ కాలికంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ జూనియర్ డాక్టర్ల సంఘం సమ్మె ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అందుబాటులో ఉంటామని.. మిగతా సేవలు అన్నింటినీ కూడా బహిష్కరిస్తున్నట్లు ఇటీవల తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రకటన చేయడం సంచలనంగా మారిపోయింది.



 ఈ నెల 10వ తేదీన రాష్ట్ర వైద్య, విద్యాశాఖ సంచాలకులు రమేష్ రెడ్డికి తమ సమ్మె నోటీసును కూడా అందజేసింది తెలంగాణ రాష్ట్ర జూనియర్ డాక్టర్ల అసోసియేషన్.  అయితే జూనియర్ డాక్టర్ల సమ్మె పై మొన్నటి వరకూ మౌనంగా నే ఉన్న సీఎం కేసీఆర్ ఇటీ వలే ఈ సమస్యపై ప్రగతి భవన్ వేదికగా సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ క్లిష్ట పరిస్థితు ల్లో జూనియర్ డాక్టర్లు సమ్మె కు పిలుపునివ్వడం సరైనది కాదు అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. జూనియర్ డాక్టర్ల అందరూ ప్రజారోగ్యాన్ని దృష్టి లో ఉంచుకుని వెంటనే సమ్మె విరమించి .. విధుల్లో చేరి ప్రజలందరికీ సేవలు అందించాలని సీఎం కేసీఆర్ సూచించారు.



 జూనియర్ డాక్టర్ల సమస్యల పై ఎప్పుడు ప్రభుత్వం వివక్ష చూపలేదు అంటూ తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్.. జూనియర్ డాక్టర్ల న్యాయ పరమైన డిమాండ్లను పరిష్కరించేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా నే ఉంటాము అంటూ చెప్పుకొచ్చారు. ఇక జూనియర్ డాక్టర్ల సమస్య లన్నింటినీ వెంటనే పరిష్కరించాలి అంటూ ఆదేశాలను సైతం జారీ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. అంతేకాకుండా కరోనా వైద్య సేవలో కొనసాగుతున్న వైద్య విద్యార్థులకు సైతం సీనియర్ రెసిడెంట్ లకు ఇచ్చే గౌరవ వేతనం అందించాలని ఈ సందర్భంగా సూచించారు. ఇక జూనియర్ డాక్టర్ల తో పాటు వారి కుటుంబీకు లకు కూడా నిమ్స్ లో మెరుగైన చికిత్స అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kcr